బాలీవుడ్ హీరోయిన్‌కు హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమం!

ప్రముఖ బాలీవుడ్ నటి గెహనా వశిస్త్‌‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. గురువారం మధ్యాహ్నం మధ్ ఐలాండ్‌లో ఓ వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో గెహానాకు గుండెపోటు రాగా యూనిట్ హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె శ్వాస ఆగిపోవడంతో.. డాక్టర్లు షాక్ ఇచ్చి తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. ప్రస్తుతం గెహానాకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ‘గెహనా.. ముందు కంటే ఇప్పుడు ట్రీట్మెంట్‌కు బాగా స్పందిస్తోందని.. త్వరలోనే ఆమెను జనరల్ […]

బాలీవుడ్ హీరోయిన్‌కు హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమం!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:11 PM

ప్రముఖ బాలీవుడ్ నటి గెహనా వశిస్త్‌‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. గురువారం మధ్యాహ్నం మధ్ ఐలాండ్‌లో ఓ వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో గెహానాకు గుండెపోటు రాగా యూనిట్ హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె శ్వాస ఆగిపోవడంతో.. డాక్టర్లు షాక్ ఇచ్చి తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. ప్రస్తుతం గెహానాకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

‘గెహనా.. ముందు కంటే ఇప్పుడు ట్రీట్మెంట్‌కు బాగా స్పందిస్తోందని.. త్వరలోనే ఆమెను జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తామని చెప్పారు’. రెండు రోజుల పాటు వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఆమె కేవలం ఎనర్జీ డ్రింక్స్ మాత్రమే తీసుకోవడంతో బీపీ తగ్గిపోయి.. మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ప్రమాదం ఏమి లేదని.. రెండు రోజుల్లో అంతా నార్మల్ స్టేజికి వస్తుందని గెహనాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ స్పష్టం చేశారు.