బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా శుక్రవారం (ఏప్రిల్ 14) ఉదయం ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టారు. బీటౌన్‌కు చెందిన ఓ ఫైనాన్షియర్ తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియో రికార్డింగ్ కోసం డబ్బులు ఇస్తానని నమ్మబలికాడనీ.. కొన్ని కారణాలవల్ల నటించేందుకు తాను అంగీకరించకపోవడంతో తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు నటి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 506, 509 సెక్షన్ల కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న సాహిద్, రాజ్ కుంద్రాలను రాఖీ సావత్ సపోర్ట్ చేయడంపై అప్పట్లో షెర్లిన్ చోప్రా వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీంతో ఒక్కసారిగా షెర్లిన్ పాపులర్ అయ్యారు. నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా తనను వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ 2021 ఏప్రిల్‌లో అతనిపై షెర్లిన్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. రాజ్‌కుంద్రాపై ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ అవాస్తవమని, నిరూపించేందుకు ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ షెర్లిన్ చోప్రాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. ఐతే ఈ వివాదంతో రాజ్‌కుంద్రాను సపోర్ట్ చేస్తూ రాఖీ సావత్ మాట్లాడటంతో హెర్లిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వేధింపుల గురించి నేను ఎప్పుడు మాట్లాడినా రాఖీ సావంత్ లాంటివాళ్లు తెరముందుకొచ్చి తనను వేశ్యగా పిలుస్తుంటారని, మీటూ నిందితులను రాఖీ సావత్ ఎందుకు ససోర్ట్ చేస్తుందో తెలియడం లేదంటూ షెర్లిన్ పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.