లైవ్‌ షోలో సింగర్‌పై కాల్పులు.. కాలికి బుల్లెట్‌ గాయం..!

|

Jun 02, 2023 | 9:07 AM

Nisha Upadhyay: ప్రముఖ భోజ్‌పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు లైవ్‌షోలో అపశృతి చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమెకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. దీంతో హుటాహుటీనా పాట్నాలోని మాక్స్ ఆసుపత్రికి..

లైవ్‌ షోలో సింగర్‌పై కాల్పులు.. కాలికి బుల్లెట్‌ గాయం..!
Nisha Upadhyay
Follow us on

Nisha Upadhyay: ప్రముఖ భోజ్‌పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు లైవ్‌షోలో అపశృతి చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. దీంతో హుటాహుటీనా పాట్నాలోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బీహార్‌లోని పాట్నాలో నిర్వహించిన లైవ్ షోలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. యజ్ఞం జరుగుతున్న సమయంలో కాల్పులు జరిగాయి.

ఎవరీ నిషా ఉపాధ్యాయ..?

నిషా ఉపాధ్యాయ బీహార్‌కి చెందిన ప్రఖ్యాత గాయని. సరన్ జిల్లాలోని గౌర్ బసంత్‌ ఆమె స్వస్థలంకు చెందిన నిషా ఉపాధ్యాయ జానపద గాయకురాలు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్‌తో నిషా ఉపాధ్యాయ పాలపులారిటీ సంపాదించుకున్నారు. నిషా ఉపాధ్యాయకి బుల్లెట్ తగలడంపై పోలీసులు స్పందింస్తూ.. ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ అధికారి తెలిపారు.

ఎవరైనా నిర్లక్ష్యంగా తుపాకీ వంటి మారణాయుధాలు వినియోగించినా, వేడుకల్లో కాల్పులు జరిపినా కనీసం రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధిస్తామని 2019లో తీసుకొచ్చిన ఆయుధ సవరణ బిల్లు పేర్కొంది. దీనిని బీహార్‌ హోంమంత్రి అమిత్ షా పైలట్ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.