Coronavirus: సినీ తారలను వదలని కరోనా.. వైరస్ బారిన పడిన ‘సేనాపతి’ నటి..

సినీ ప్రముఖులను నీడలా వెంటాడుతోంది కరోనా మహమ్మారి.  ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా పలువురు ప్రముఖులను తన బాధితులుగా మార్చుకుంటోంది.  టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ రంగాన్ని

Coronavirus: సినీ తారలను వదలని కరోనా.. వైరస్ బారిన పడిన సేనాపతి నటి..
Pavani Reddy

Edited By:

Updated on: Jan 22, 2022 | 9:47 AM

సినీ ప్రముఖులను నీడలా వెంటాడుతోంది కరోనా మహమ్మారి.  ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా పలువురు ప్రముఖులను తన బాధితులుగా మార్చుకుంటోంది.  టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ రంగాన్ని వదిలిపెట్టడం లేదీ వైరస్. తాజాగా  ‘బిగ్‌ బాస్‌’ తమిళ సీజన్‌-5 ఫేమ్ పావని రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను’ అని పోస్ట్ పెట్టిందీ ముద్దుగుమ్మ.

కాగా తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి  హిట్  సీరియల్స్‌లో నటించింది పావని రెడ్డి.  ఆతర్వాత  ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి తెలుగు  సినిమాల్లోనూ మెరిసింది. అయితే పెద్దగా గుర్తింపు రావకపోవడంతో తమిళ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. చిన్న తంబి, రసంతి సీరియల్స్‌ ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది. ఈ క్రేజ్ తోనే   ‘బిగ్‌ బాస్‌’ తమిళ సీజన్‌-5లో అడుగుపెట్టి అభిమానుల ఆదరాభిమానాలతో సెకెండ్ రన్నరప్ గా నిలిచింది. కాగా రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో ‘ఆహా’ లో విడుదలైన ‘సేనాపతి’ లోనూ ఓ కీలక పాత్రలో నటించింది పావని.

Also Read: IND VS SA: రెండో వన్డేలోనూ చతికిల పడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..

Budget 2022: బడ్జెట్‌లో రైతులకు గుడ్‌న్యూస్ రానుందా..!

Woman Pulls Bus With Hair video: డ‌బుల్ డెకర్‌ బ‌స్సును జడతో సులభంగా లాగి గిన్నిస్ బుక్‌లో రికార్డ్‌.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో..