AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్.. రూ.5 లక్షలు మోసం చేసిందని యువకుడు ఫిర్యాదు..

బిగ్ బాస్ కంటెస్టెంట్ వర్షిణిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక యువకుడిని బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో ఆమె ఇప్పుడు అరెస్టు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Bigg Boss : బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్.. రూ.5 లక్షలు మోసం చేసిందని యువకుడు ఫిర్యాదు..
Bigg Boss Varshini
Rajitha Chanti
|

Updated on: Sep 23, 2026 | 1:45 PM

Share

ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షోలలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న యువ నటి వర్షిని వెంకట్ పోలీసులకు చిక్కారు. ఓ యువకుడిని షార్ట్ ఫిలిమ్ నిర్మాణం పేరుతో మోసం చేసి రూ. 5 లక్షలు వసూలు చేయడమే కాకుండా, డబ్బులు తిరిగి అడిగినందుకు బాధితుడిని బెదిరించి నగదు, మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కున్న తీవ్ర ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సినీ వర్గాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నటి వర్షిని వెంకట్‌కు చెన్నైకి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, తాను త్వరలో ఓ ప్రతిష్టాత్మక షార్ట్ ఫిలిమ్‌ను నిర్మించబోతున్నానని ఆమె ఆ వ్యక్తికి చెప్పింది. ఆ చిత్రంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని, నిర్మాణ భాగస్వామిగా అవకాశం కల్పిస్తానని అతనికి నమ్మబలికింది. ఆమె చెప్పిన మాటలను నమ్మిన బాధితుడు విడతలవారీగా మొత్తం రూ. 5 లక్షల నగదును ఆమెకు అందజేశాడు.

అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ షార్ట్ ఫిలిమ్ షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో పాటు, చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు, తాను ఇచ్చిన డబ్బును వెంటనే వెనక్కి ఇవ్వాలని వర్షిని వెంకట్‌ను గట్టిగా నిలదీశాడు.

డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు పదేపదే ఒత్తిడి చేయడంతో వర్షిని వెంకట్ కోపంతో రగిలిపోయింంది. గిండి ప్రాంతంలో బాధితుడిని కలిసి బెదిరింపులకు పాల్పడింది. ఆమె తన అనుచరులతో కలిసి బాధితుడిపై దాడికి దిగి, అతని వద్ద ఉన్న రూ. 50,000 నగదును మరియు రెండు మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు వెంటనే గిండి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు మోసం, బలవంతపు వసూళ్లు మరియు బెదిరింపుల కింద నటి వర్షిని వెంకట్‌తో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నటి వర్షిని వెంకట్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సినీ పరిశ్రమలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

వర్షిణి వెంకట్..

Varshni

Varshni

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us