Srikanth: ఆ మూవీ తర్వాత పెద్ద దెబ్బపడింది.. ఆ తర్వాత 20 సినిమాలు ప్లాప్ అయ్యాయి.. హీరో శ్రీకాంత్..
నటుడు శ్రీకాంత్ తన సినీ కెరీర్ ప్రయాణం గురించి పంచుకున్నారు. మహాత్మ చిత్రం తర్వాత ఎదురైన సవాళ్లు, వరుస వైఫల్యాల గురించి వివరించారు. ఇండస్ట్రీలో నిలబడాలంటే సక్సెస్ ఒక్కటే కాదని, మనిషిగా నిలబడటం ముఖ్యమని చెప్పారు. కొటబొమ్మాలిలో తన పాత్ర విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, మళ్లీ ప్రశంసలు పొందారు. ప్రస్తుతం సహయ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. దశాబ్దాలుగా సినీరంగంలో రాణిస్తూ తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం సహయ నటుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత విలువలు, ఇటీవల కొటబొమ్మాలి చిత్రంతో పొందిన ప్రశంసల గురించి ఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. తన కెరీర్ మొదట్లో వన్ బై ట చిత్రం వంద రోజులు ఆడి తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని, అది హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిందని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో బ్రహ్మ గారు మాట ఇచ్చారంటే డెఫినెట్‌గా చేస్తున్నానురా అంటే అంతే అని, ఆయన నమ్మకంతోనే తాను హీరోగా కొనసాగినట్లు తెలిపారు. తాజ్‌మహల్, పెళ్లి సందడి, ఆహా నా పెళ్ళంట, వినోదం వంటి వరుస విజయాలతో శ్రీకాంత్ కెరీర్ ఓ ఊపందుకుంది. ఈ చిత్రాలన్నీ లక్కీగా హిట్‌లు కావడంతో, ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు కమిట్ అయ్యి, ఆ తర్వాత వాటి విజయాలు తనను నిలబెట్టాయని చెప్పారు. అయితే, ప్రతి విజయవంతమైన సినిమా తర్వాత తదుపరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, కానీ అప్పట్లో అది జరగలేదని అన్నారు. ముఖ్యంగా మహాత్మ చిత్రం తర్వాత తన కెరీర్‌కు పెద్ద దెబ్బ తగిలిందని శ్రీకాంత్ వెల్లడించారు. ఆ తర్వాత దాదాపు 20 నుంచి 25 చిత్రాల్లో హీరోగా నటించినా, ఏదీ విజయం సాధించలేదని ఒప్పుకున్నారు. దీనికి కారణం తెలియదని, కొంతమంది టైం బాలేదు అంటారని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
కెరీర్‌లో ఎదురైన ఈ సవాళ్ల గురించి మాట్లాడుతూ, యువ హీరోల రాకతో సినీ పరిశ్రమలో మార్పులు వచ్చాయని, యంగ్‌స్టర్స్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏ హీరో అయినా కొంతకాలం అయిన తర్వాత మెల్లగా ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతా ఉంటుంది అని అన్నారు. ఒకప్పుడు సినిమా బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేవారని, ఓపెనింగ్స్‌తో కొట్టేసే సీన్ లేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, మొదటి రోజు టాక్ బాగాలేకపోతే నాలుగో రోజే సినిమా తీసేస్తున్నారని, కొన్నిసార్లు మధ్యాహ్నానికే తీసేస్తున్నారని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
ఈ ఒడిదుడుకుల మధ్య కూడా, తాను నటుడిగా ఎప్పుడూ విఫలం కాలేదని శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా పోయినా, తన నటనపై ఎవరూ విమర్శలు చేయలేదని, శ్రీకాంత్ బాగా చేయలేదు అన్న మాట ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ సహజమని, కానీ మనిషిగా నిలబడాలి అనేదే తన సిద్ధాంతమని నొక్కి చెప్పారు. ఒక హ్యూమానిటీ అనేది 100% నేనైనా కాదు ఇప్పుడు మా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నేర్చుకోవాలి కదా అని తన వ్యక్తిత్వ ప్రాముఖ్యతను వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
