అషూరెడ్డి (Ashu Reddy).. జూనియర్ సమంత(Samantha) గా పేరు తెచ్చుకున్న ఈ బుల్లితెర బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాతో తెచ్చుకున్న క్రేజ్ తో బిగ్‌బాస్ (Biggboss) హౌస్ లో అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది. వీటన్నింటినీ పక్కన పెడితే దర్శకుడు ఆర్టీవీతో చేసిన ఇంటర్వ్వూతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫొటోలైతే చాలా హాట్‌గా ఉంటాయి. దీని కారణంగానే ఒక్కోసారి నెటిజన్ల చేతితో దారుణంగా ట్రోల్‌కు గురువుతుంటోందీ అందాల తార. అలా తాజాగా మరోసారి ట్రోలర్స్‌కు అడ్డంగా దొరికిపోయింది అషు. ఈ సారి తన చిత్రవిచిత్రమైన డ్రెస్ తో నెటిజన్లకు దొరికిపోయింది. తాజాగా టార్న్ డెనిమ్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన ఆమె ఆ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. వాటికి ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పెద్దాయన చెప్పాడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇది చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. పాపం అషూపై వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో చినిగిన చొక్కా వేసుకున్నావ్ సరే.. మరి పుస్తకం కొన్నావా? షర్టు మరీ అలా చిరిగిపోయిందేంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ అమ్మడు త్వరలోనే సిల్వర్ స్ర్కీన్‌పై కూడా దర్శనమివ్వనుంది. విజయ్‌శంకర్ తో కలిసి ఆమె ఫోకస్ అనే ఓ చిత్రంలో నటిస్తోంది. సీనియర్ నటి సుహాసినీ మణిరత్నం ఇందులో ఓ కీలకపాత్రలో నటించనున్నారు. జి. సూర్యతేజ దర్శకత్వంలో స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
IND vs SL: రోహిత్ శర్మ ఖాతాలో చేరనున్న భారీ రికార్డు.. మరో 12 సిక్సులు కొడితే..!