Bajrang Dal Activist Murder Case: భజరంగ్‌దళ్ కార్యకర్త హత్య కేసులో నిందితుల అరెస్ట్.. శివమొగ్గలో శుక్రవారం వరకు కర్ఫ్యూ ..
కర్నాటక లోని శివమొగ్గలో భజరంగ్‌దళ్ కార్యకర్త హర్ష హత్యపై రాజకీయ రగడ కొనసాగుతోంది. హర్ష హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 12 మందిని విచారించినట్టు పోలీసులు..
కర్నాటక లోని శివమొగ్గలో(Shivamogga) భజరంగ్‌దళ్(Bajrang Dal) కార్యకర్త హర్ష హత్యపై రాజకీయ రగడ కొనసాగుతోంది. హర్ష హత్య కేసులో(Harsha’s murder) ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 12 మందిని విచారించినట్టు పోలీసులు తెలిపారు. హర్ష హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులందరిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. . హిజాబ్ వివాదంతో పాటు అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను విచారించిన తరువాత హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. కసీఫ్ , నదీమ్ అనే ఇద్దరు యువకులు హర్ష హత్యకు కుట్ర చేసినట్టు చెబుతున్నారు. వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
హత్యకు గురైన హర్షపై కూడా గతంలో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అల్లర్లకు పాల్పడడంతో పాటు మతవిద్వేషాలను రెచ్చగొట్టినట్టు 2016-2017 సంవత్సరంలో కేసులు నమోదైనట్టు షిమోగ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం శివమొగ్గలో పరిస్థితి అదుపు లోనే ఉందని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం వరకు కర్ఫ్యూను పొడిగించారు.
స్కూళ్లు , విద్యాసంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మరోవైపు హర్ష హత్యపై కర్నాటకలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగానే..తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. భజరంగ్‌దళ్ కార్యకర్త విస్ట్ హర్ష హత్య వెనుక కాంగ్రెస్ హస్తముందంటూ హాట్ కామెంట్స్ చేశారు.
All accused have been identified. Teams are outside as well as inside Shivamogga district. So, work is going on & we are on the verge of completing the detection and arresting the accused persons: Pratap Reddy, Additional DGP, Karnataka on Bajrang Dal activist Harsha murder case pic.twitter.com/2IA5SVluSu
— ANI (@ANI) February 22, 2022
డీకే శివకుమార్, బీకే హరిప్రసాద్‌తో పాటు మరికొందరు నేతల ప్రమేయముందన్నారు. వారు రెచ్చగొట్టడం వల్లే ఈ హత్య జరిగిందన్నారు. ఈ కేసును ఎన్‌ఐకి అప్పగించాలని డిమాండ్ చేశారాయన. హర్ష కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. హిజాబ్ వివాదానికి హర్ష కేసు హత్యకు సంబంధం ఉందని బీజేపీ నేతలంటుంటే .. ఇది వాస్తవం కాదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
మరోవైపు హర్ష అంతిమయాత్రలో పాల్గొన్న ఈశ్వరప్ప బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. షిమోగలో హర్ష హత్య తరువాత చెలరేగిన హింసకు ఈశ్వరప్పనే బాధ్యుడని అన్నారు. వెంటనే ఆయన్ను మంత్రిపదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి: History of Chicken 65: యమ్మీ..యమ్మీ.. చికెన్ 65.. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..