Bigg Boss 9 Telugu: కామనర్స్ మధ్య గొడవ.. ప్రియ, శ్రీజతో మనీష్ లొల్లి..

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే హౌస్ లో గొడవలు మొదలయ్యాయి. ఓనర్లు, టెనెంట్స్ కొట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు కామనర్లు మధ్య గొడవ మొదలైంది. కామ్ గా ఉంటున్నానని నన్ను తొక్కడానికి ట్రై చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మనీష్. తాజాగా విడుదలైన ప్రోమో చూశారా.. ?

Bigg Boss 9 Telugu: కామనర్స్ మధ్య గొడవ.. ప్రియ, శ్రీజతో మనీష్ లొల్లి..
Bigg Boss 9 Tleugu

Updated on: Sep 11, 2025 | 6:30 PM

బిగ్‌బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ మధ్య రోజుకో గొడవ సాగుతుంది. ఇక సంజన దెబ్బకు హౌస్ మొత్తం షాకయ్యింది. దీంతో సంజనకు సపోర్ట్ బాగా పెరిగింది. సంజన దెబ్బకు హౌస్ లో లెక్కలు మారిపోయాయి. గుడ్డు తిని తాను తినలేదని బుకాయించడంతో హౌస్మేట్స్ కొట్టుకున్నారు. తీరా అంతా అయ్యాక తానే గుడ్డు తిన్నానని సంజన చెబ్బడంతో హౌస్మేట్స్ షాకయ్యారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో సంజన దెబ్బకు కామనర్స్ మధ్య లొల్లి షూరు అయ్యింది. ఆ అమ్మాయి ఒక్కదాని వల్ల మొత్తం టీమ్ మెంబర్స్ మొత్తం మెంటల్లీ డిస్ట్రబ్ అయిపోయారు.. అంటూ శ్రష్టి ఫైర్ అయ్యింది. మరోవైపు సంజన గారికి టూ డేస్ హౌస్ లోకి ఎంట్రీ ఓకేనా అంటూ సోల్జర్ కళ్యాణ్ ప్రపోజల్ పెట్టాడు. దీంతో అందరూ ఒకే చెప్పారు.

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

అందరూ ఓనర్లే కానీ నేను పిలువాలనుకున్నప్పుడు పిలుస్తాను అంటూ శ్రీజ చెప్పింది. దీంతో మనీష్ మధ్యలో కల్పించుకుని.. ఇది గుర్తుపెట్టుకోండి.. ఇప్పటివరకు నన్ను అలా ట్రీట్ చేయలేదు. మీరిద్దరూ ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు ప్రియ, శ్రీజపై సీరియస్ అయ్యాడు. నిన్ను పాయింట్ అవుట్ చేయాలంటే చాలా చేయొచ్చు అని శ్రీజ రివర్స్ అయ్యారు. నేను కామ్ గా ఉంటున్నానని నన్ను తొక్కడానికి ట్రై చేయకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు మనీష్.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

ప్రియ నాకు మాట్లాడాలని లేదు.. మానిటర్ గా మీరు ఇష్టమొచ్చినట్లుగా మీరు చేసుకోండి ఓనర్ గా నేను నాకు నచ్చినట్లు చేసుకుంటా అంటూ మనీష్ తేల్చి చెప్పారు. దీంతో నీకు నో చెప్తే ఆ ఆప్షన్ నువ్వు తీసుకోలేవు అంటూ ప్రియ సీరియస్ అయ్యింది. నిన్నటి నుంచి నోటీస్ చేస్తున్నాను ఏదేదో మాట్లాడుతున్నావ్ నేను ఏదో కామ్ ఉంటున్నాను.. మీరు చెప్పినవన్నీ పడుతున్నాను కదా అని వద్దబ్బా వద్దంటున్నా కదా అంటూ మనీష్ ఊగిపోయాడు. మొత్తానికి కామనర్స్ మధ్య గట్టిగానే రచ్చ జరిగింది.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..