Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సందడి మళ్లీ మొదలైంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు విజయవంతం కాగా తాజాగా 5వ సీజన్ ప్రారంభమైంది. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 5వ సీజన్ ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కంటెస్టెంట్‌ల డ్యాన్స్‌లు, వారి ప్రమోలతో సందడిగా మారింది. ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లు సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తొలి రోజే బిగ్‌బాస్ తనదైన టాస్క్‌లతో హౌజ్ సభ్యులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లో పాల్గొన్న వారిలో లోబో ఒకరు. మా టీవీ ద్వారానే కెరీర్ ప్రారంభించిన లోబో ఇప్పుడు అదే చానల్ నిర్వహిస్తోన్న షోలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్‌బాస్ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించిన లోబో.. గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లోబో అప్పుడలా.. ఇప్పుడిలా మాట్లాడరంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. లోబో గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ‘బిగ్‌బాస్ షో గురించి మీ అభిప్రాయం ఏంటి.?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘బిగ్‌బాస్‌కు ఓ దండంరా అయ్యా. అది నా టేస్ట్ కాదు.. బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం నాకు రాకపోవమే మంచిది. నాకు ఆ షో నచ్చదు’ అంటూ సమాధానం ఇచ్చాడు.
దీంతో ప్రస్తుతం లోబో బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆ పాత వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు లోబో వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. లోబో సదరు ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి.
#Lobo 😂#BiggBossTelugu5pic.twitter.com/htDetbYrY0
— Why that (@HeeZG0ne) September 6, 2021
Also Read: Viral Photo: ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?
Bigg Boss Telugu 5: ఈ సారి బిగ్ బాస్‌లో ‘5మచ్’ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది.. హౌస్‌లో ఉన్నది వీళ్ళే..
Manchu Manoj: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన హీరో మనోజ్.. ఆ విషయంపై గంటకు పైగా భేటీ..