Bigg Boss 4: కలిసిపోయిన మోనాల్-అఖిల్.. అసలు రీజన్ చెప్పిన అఖిల్
వారాంతం ఎపిసోడ్‌లో నాగార్జున ఎప్పటిలాగే జోరు చూపించారు. హౌజ్‌లో ఉన్న అందరితో మాట్లాడారు. ఇక గత కొన్ని రోజులుగా మోనాల్ ఒంటరిగా ఫీలవడాన్ని
Akhil Monal Bigg Boss 4: వారాంతం ఎపిసోడ్‌లో నాగార్జున ఎప్పటిలాగే జోరు చూపించారు. హౌజ్‌లో ఉన్న అందరితో మాట్లాడారు. ఇక గత కొన్ని రోజులుగా మోనాల్ ఒంటరిగా ఫీలవడాన్ని చూసిన నాగార్జున ఏమైందని ప్రశ్నించారు. అఖిల్ తనను ఎలిమినేషన్‌కి నామినేట్ చేయడం తట్టుకోలేకపోయానని, తనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కానీ పట్టించుకోలేదని బాగా ఫీల్ అయ్యింది. ఈ హౌస్‌లో అతడు తన ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ( Bigg Boss 4: ఇమ్యూనిటీ పొందిన అవినాష్.. మోనాల్‌కి షాక్)
వెంటనే అఖిల్ స్పందిస్తూ.. ఆమె స్ట్రాంగ్ అవ్వాలనే అలా చేశానని సమాధానం చెప్పాడు. దీంతో నాగార్జున.. ఆమె నీకు ఫ్రెండా..? అంత కన్నా ఎక్కువా..? అని నాగ్ సూటి ప్రశ్న వేశాడు. ఒక్క క్షణం ఆలోచించిన అఖిల్, ఫ్రెండ్ అని చెప్పాడు. ఇక ఇదే ప్రశ్నను మోనాల్‌ని అడగ్గా ఆమె కూడా జస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది. ఇదిలా ఉంటే వెలిగే దీపం ఎవరన్న ప్రశ్నకు మోనాల్ అఖిల్ పేరును చెప్పింది. దీంతో సంతోషం పట్టలేకపోయిన అఖిల్, మోనాల్‌ని హత్తుకున్నాడు. దీంతో ఇన్నాళ్ల ఎడబాటుకు చెక్ పడగా.. ఆ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ( Bigg Boss 4: హారికను సేఫ్ చేసిన కమల్)