Bigg Boss 4: ఇమ్యూనిటీ పొందిన అవినాష్.. మోనాల్‌కి షాక్
ఆ తర్వాత నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. టీ స్టాండ్ టాస్క్‌లో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్‌లు తరువాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు
Bigg Boss 4 Avinash: ఆ తర్వాత నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. టీ స్టాండ్ టాస్క్‌లో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్‌లు తరువాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా ఇద్దరికీ చెరో బుట్టను ఇచ్చి అందులో ఇంటిసభ్యులను ఒప్పించి వారి వస్తువులను త్యాగం చేయాలని కోరమన్నారు. ఎవరి బుట్ట బరువెక్కితే వారు ఇమ్యూనిటీ పొందుతారని నాగ్ చెప్పారు. ఈ క్రమంలో అవినాష్ సింపథీ కార్డును ఉపయోగించాడు. నేను షో వదులుకొని వచ్చా. మళ్లీ తీసుకోమన్నారు. ఇంటి అప్పులు క్లియర్ చేసుకోవాలి. మా కుటుంబాన్ని చూసుకోవాలి అని అందరినీ అభ్యర్థించాడు. ఈ క్రమంలో అఖిల్ ఒక్కటే మోనాల్‌కి సపోర్ట్ చేయగా.. లాస్య, సొహైల్, మెహబూబ్, అరియానా అందరూ అవినాష్‌కి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అవినాష్‌కి ఇమ్యూనిటీ లభించిందని నాగ్ తెలిపారు.
Read More:
Bigg Boss 4: హారికను సేఫ్ చేసిన కమల్