AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్ త్రిగుణ్ భార్య నివేదిత ఎవరో తెలుసా ?.. వీరి లవ్ స్టోరీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

బిగ్ బాస్ సీజన్ 10 మొదలై కేవలం మూడు వారాలు మాత్రమే కావొస్తుంది. కానీ ఇప్పటికీ టైటిల్ విన్నర్ రేసులోకి వచ్చేశాడు త్రిగుణ్. దాదాపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రాని గుర్తింపు కేవలం ఒక్క బిగ్ బాస్ షో ద్వారా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ తెలుగు హీరో పేరు మారుమోగుతుంది. అంతేకాదు టైటిల్ విన్నర్ రేసులో రోహిత్, ముకేష్ తోపాటు త్రిగుణ్ పేరు సైతం వినిపిస్తుంది.

Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్ త్రిగుణ్ భార్య నివేదిత ఎవరో తెలుసా ?.. వీరి లవ్ స్టోరీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Trigun
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2026 | 11:19 AM

Share

త్రిగుణ్.. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా సినీరంగంలో ఉంటున్నప్పటికీ రానీ పేరు ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్నాడు. మొదటి రోజు నుంచే రోహిత్ ను టార్గెట్ చేసి రెచ్చగొట్టడం.. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటూ అట్రాక్షన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు త్రిగుణ్ గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అతడి ప్రేమ, పెళ్లి విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. త్రిగుణ్ కు 2023 సెప్టెంబర్ 2న నివేదిత అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. తమిళనాడుకి చెందిన నివేదితను తిరుప్పూర్ జిల్లా అవినాషి పట్టణంలోని శ్రీ సెంథూర్ మహల్‌లో పెళ్లాడాడు త్రిగుణ్. అయితే వీరిది చెన్నై లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అయితే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో త్రిగుణ్ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి.

అయితే అప్పట్లో త్రిగుణ్ పెళ్లి గురించి చాలా రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా అతడు సైలెంట్ గా పెళ్లి చేసుకోవడంపై నెటిజన్స్ స్పందిస్తూ పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని టాక్ నడిచింది. ఈ రూమర్స్ పై త్రిగుణ్ క్లారిటీ ఇచ్చాడు. తనది సీక్రెట్ మ్యారేజ్ కాదని.. తన పెళ్లికి ఉన్న కారణాలను వెల్లడించారు. త్రిగుణ్ మాట్లాడుతూ.. తనది “సీక్రెట్ మ్యారేజ్” కాదని, ప్రత్యేక పరిస్థితుల కారణంగా నిరాడంబరంగా జరిగిందని స్పష్టం చేశారు. వాస్తవానికి, త్రిగుణ్ భారీ ఎత్తున, వేడుకగా తన వివాహాన్ని జరుపుకోవాలని ప్రణాళికలు చేసుకున్నారు. సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకల కోసం ఇప్పటికే వేదికలను ఖరారు చేసి, అడ్వాన్స్ చెక్కులను కూడా అందజేశారు. అయితే, పెళ్లికి కేవలం మూడు నెలల ముందు త్రిగుణ్ తల్లి మరణించడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ సంఘటన కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. త్రిగుణ్ తన తల్లి తన ఏకైక కొడుకునని, ఆమెకు తాను సినిమాల్లో పెద్ద హీరో అవ్వడం కంటే, తన పెళ్లిని చూడాలనేది జీవితాశయమని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.

తన తల్లి ఆ చివరి కోరికను చూడలేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి మరణంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి అని భావించారని, అందుకే చిన్నగా, ఎవరినీ పిలవకుండా వివాహం చేసుకోవాలని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు పట్టుబట్టారని త్రిగుణ్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

Follow Us