AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise : ఇదేం క్రేజ్ రా బాబూ.. అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం.. 24 గంటల్లోనే లక్షలకు పైగా టికెట్స్ సేల్..

‘ది ప్యారడైజ్’.. 23 రాత్రి నుంచి థియేటర్లలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వైల్డ్ ఫైర్‌లా ఉంటుంది. డైరెక్ట్‌గా థియేటర్‌లో కలుసుకుందాం. సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు నేచురల్ స్టార్ నాని. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ లో ది ప్యారడైజ్ చిత్రం రికార్డులు సృష్టిస్తుంది.

The Paradise : ఇదేం క్రేజ్ రా బాబూ.. అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం.. 24 గంటల్లోనే లక్షలకు పైగా టికెట్స్ సేల్..
The Paradise Movie
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2026 | 8:05 AM

Share

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ హైప్ ఉంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ‘ది ప్యారడైజ్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో నయా రికార్డులు సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జోడీ ‘రా అండ్ రస్టిక్’ యాక్షన్ డ్రామాతో థియేటర్లలోకి రాబోతుండటంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ఇదిలా ఉంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విండో తెరుచుకున్న కొద్ది నిమిషాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు వేగంగా నిండిపోతున్నాయి. ముఖ్యంగా నైజాం రీజియన్‌లో బుకింగ్స్ ప్రారంభం కాగానే హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో ‘హౌస్‌ఫుల్’, ‘ఫాస్ట్ ఫిల్లింగ్’ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. విక్రయాలు మొదలైన తొలి గంటలోనే బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి ఆన్‌లైన్ యాప్స్‌లో ఏకంగా 25 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. అందులో ఒక్క బుక్‌మైషో ద్వారానే తొలి గంటలో దాదాపు 17 వేల టికెట్లు అమ్ముడవడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌లో కూడా టికెట్ ధరల పెంపునకు సంబంధించి అధికారిక అనుమతులు రావడంతో బుకింగ్స్ మరింత ఊపందుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ ఊపందుకోవడంతో కేవలం గత 24 గంటల వ్యవధిలోనే బుక్‌మైషో పోర్టల్‌లో ఏకంగా 2.02 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. నాని కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని రీతిలో బుకింగ్ నంబర్లు నమోదవుతుండటంతో ట్రేడ్ వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. దీంతో ది ప్యారడైజ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఈ హైప్ చూస్తే తెలుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us