AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉంచే సింపుల్ కిచెన్ టిప్స్ ఇవే!

బంగాళాదుంపలను తరిగి పక్కన పెడితే కొద్దిసేపటికే అవి నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం చూస్తుంటాం. ఇలా రంగు మారిన దుంపలు తినడానికి సురక్షితమే అయినప్పటికీ, వంటకాల్లో చూడటానికి బాగుండవు. వీటిని నల్లబడకుండా తాజాగా ఉంచడానికి కొన్ని సులువైన కిచెన్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అలాంటి అద్భుత చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉంచే సింపుల్ కిచెన్ టిప్స్ ఇవే!
Cut Potatoes Turning Black
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2026 | 7:31 AM

Share

మన వంటింట్లో ప్రతిరోజూ ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంప మొదటి స్థానంలో ఉంటుంది. స్నాక్స్ నుంచి కూరల వరకు అనేక వంటకాల్లో దీనిని ఉపయోగిస్తాం. అందుకే చాలామంది వంట సులభంగా పూర్తికావడానికి ముందుగానే బంగాళాదుంప తొక్క తీసి, ముక్కలుగా కోసి పక్కన పెడుతుంటారు. అయితే, కొద్దిసేపటికే ఆ ముక్కల పైభాగం నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం గమనించవచ్చు. ఇలా రంగు మారడం వల్ల దుంపలు పాడైపోయాయని భావించాల్సిన అవసరం లేదు. కానీ, ఇవి చూడటానికి అంత ఆకర్షణీయంగా ఉండవు.

బంగాళాదుంపలు నల్లగా ఎందుకు మారతాయి?

బంగాళాదుంపలు నల్లబడటానికి కారణం ఆక్సిడేషన్ అనే సహజ ప్రక్రియ. బంగాళాదుంపలలో స్టార్చ్, ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. దుంపలను కోసినప్పుడు గాలిలోని ఆక్సిజన్‌తో ఇవి చర్య జరిపి, నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియ వల్ల బంగాళాదుంపల రుచి లేదా నాణ్యత దెబ్బతినదు, ఇవి తినడానికి సురక్షితమే.

నల్లబడకుండా తెల్లగా ఉంచే కిచెన్ టిప్స్:

చల్లటి నీటిలో నానబెట్టడం: బంగాళాదుంప ముక్కలను కోసిన వెంటనే ఒక గిన్నెలోని చల్లటి నీళ్లలో ముంచి ఉంచాలి. నీరు గాలితో నేరుగా స్పర్శ లేకుండా చేస్తుంది. అంతేకాకుండా, చల్లటి నీరు అదనపు స్టార్చ్‌ను తొలగించి ఆక్సిడేషన్ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇందుకోసం వేడి నీటిని వాడకూడదు.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం లేదా వెనిగర్ వాడకం: చల్లటి నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం లేదా కొద్దిగా వైట్ వెనిగర్ కలపడం వల్ల నీటి pH స్థాయి తగ్గుతుంది. ఇది ఆక్సిడేషన్‌ను మరింతగా నిరోధించి, ముక్కలు ఎక్కువ సమయం తెల్లగా ఉండేలా చూస్తుంది.

జిప్‌లాక్ బ్యాగ్స్‌ లేదా ఎయిర్‌టైట్ కంటైనర్లు: గాలి చొరబడని జిప్‌లాక్ బ్యాగ్‌లలో కోసిన బంగాళాదుంపలను వేసి, గాలిని పూర్తిగా బయటకు పంపి సీల్ చేయాలి.

ఫ్రిజ్‌లో నిల్వ చేయడం: కోసిన ముక్కలను నీటితో ఉన్న కంటైనర్‌లో వేసి మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా ఆక్సిడేషన్ వేగాన్ని తగ్గించవచ్చు. తక్కువ ఉష్ణోగ్రత రంగు మారకుండా కాపాడుతుంది.

అవసరానికి చాలా సమయం ముందే బంగాళాదుంపలను కోసి పెట్టుకోకపోవడమే అత్యుత్తమ మార్గం. ఒకవేళ ముందుగానే కోసుకోవాల్సి వస్తే, పైన తెలిపిన సులువైన చిట్కాలను పాటించి వాటిని ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us