AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. కారం చట్నీతో తింటే రుచి అద్భుతం!

ప్రతి ఇంట్లోనూ రాత్రి వేళ అన్నం మిగిలిపోవడం చాలా సాధారణం. మరుసటి రోజు ఉదయం ఆ అన్నాన్ని అలాగే తినడానికి ఎవరూ ఇష్టపడరు. అలాగని, పారేయడానికి మనసు ఒప్పదు. అలాంటి సమయంలో ఆ అన్నంతో కేవలం 10-15 నిమిషాల్లో ఎంతో మృదువైన, రుచికరమైన రొట్టెలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి నూనె వాడకుండా చేసుకునే ఈ అల్పాహారం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆప్షన్.

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. కారం చట్నీతో తింటే రుచి అద్భుతం!
Leftover Rice Breakfast
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2026 | 6:59 AM

Share

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పారేయకుండా, ఉదయానికి ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మార్చుకోవచ్చు. రాత్రి మిగిలిన అన్నానికి బియ్యప్పిండికి కలిపి మెత్తటి రొట్టెలు తయారు చేసుకోవడం చాలా సులభం. నూనె వాడకపోవడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనె లేని బియ్యపు రొట్టెలను కారంగా ఉండే టమాటా లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. తక్కువ సమయంలో, ఇంట్లోని తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ వంటకం ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేసుకోవడానికి చక్కటి పరిష్కారం. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..

రాత్రి మిగిలిన అన్నం: 1 కప్పు

బియ్యప్పిండి: 1 కప్పు

ఇవి కూడా చదవండి

పచ్చిమిర్చి: 2 లేదా 3 (లేదా చిల్లీ ఫ్లేక్స్)

ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా మిగిలిపోయిన ఒక కప్పు అన్నాన్ని, పచ్చిమిర్చి మరియు సరిపడా ఉప్పుతో కలిపి మిక్సీ జార్‌లో వేయాలి. దీనికి చుక్క నీరు కూడా కలపకుండా మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ అన్నం పేస్ట్‌ను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, దానిలో ఒక కప్పు బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. అన్నంలో ఉన్న తేమతోనే పిండి ముద్దలా తయారవుతుంది. కాబట్టి, నీళ్లు పొయ్యాల్సిన అవసరం లేదు. పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకున్న తర్వాత, దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. దీనివల్ల పిండి మెత్తబడి రొట్టెలు బాగా వస్తాయి.

10 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, రొట్టెను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు నూనె లేదా నెయ్యి లేకుండా కాల్చాలి. హై ఫ్లేమ్‌లో కాల్చితే రొట్టెలు గట్టిపడతాయి, అందుకే మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి.

ఈ నూనె లేని రొట్టెలకు కాంబినేషన్‌గా రోస్టెడ్ టమాటా-ఎండుమిర్చి చట్నీ లేదా అల్లం-కొబ్బరి కారం చట్నీ నంజుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నాన్ని వృథా చేయకుండా, తక్కువ సమయంలో, ఎలాంటి నూనె లేకుండా చేసుకునే ఈ టిఫిన్ జీర్ణక్రియకు చాలా మంచిది. బ్యాచిలర్స్, ఆఫీస్‌కు త్వరగా వెళ్లాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ బ్రెక్‌ఫాస్ట్‌!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మెత్తగా ఉండే జొన్న దిబ్బరొట్టె.. షుగర్ పేషంట్స్ కూడా 2 ఎక్కువే
మెత్తగా ఉండే జొన్న దిబ్బరొట్టె.. షుగర్ పేషంట్స్ కూడా 2 ఎక్కువే
ఇంట్లో ఉంటూనే వ్యాపారం చేయొచ్చు.. ఈ బిజినెస్‌లకు ఫుడ్ డిమాండ్
ఇంట్లో ఉంటూనే వ్యాపారం చేయొచ్చు.. ఈ బిజినెస్‌లకు ఫుడ్ డిమాండ్
'రామాయణ' సినిమాపై జనజాగృతి సమితి తీవ్ర ఆగ్రహం.. పీఎస్‌లో ఫిర్యాదు
'రామాయణ' సినిమాపై జనజాగృతి సమితి తీవ్ర ఆగ్రహం.. పీఎస్‌లో ఫిర్యాదు
జస్ట్ మిస్.. టీమిండియా ఆ పని చేసుంటే మేం ఓడిపోయేవాళ్లం..
జస్ట్ మిస్.. టీమిండియా ఆ పని చేసుంటే మేం ఓడిపోయేవాళ్లం..
కాలేజీలో మెడికల్ స్టూడెంట్ కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు.. వీడియో
కాలేజీలో మెడికల్ స్టూడెంట్ కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు.. వీడియో
ఎంత బిజీగా ఉన్నా ఆ తెలుగు సినిమా పాటలు వింటే రిలాక్స్ అయిపోతా
ఎంత బిజీగా ఉన్నా ఆ తెలుగు సినిమా పాటలు వింటే రిలాక్స్ అయిపోతా
స్టార్ మిస్ టీన్ ఇండియా 2026లో రిషితకు ఫస్ట్ రన్నరప్ కిరీటం!
స్టార్ మిస్ టీన్ ఇండియా 2026లో రిషితకు ఫస్ట్ రన్నరప్ కిరీటం!
రైతన్నల బలం సీక్రెట్.. అరటికాయ ఆవ కూర.. పుల్లగా భలే రుచిగా..
రైతన్నల బలం సీక్రెట్.. అరటికాయ ఆవ కూర.. పుల్లగా భలే రుచిగా..
వాతావరణశాఖ హెచ్చరిక.. బంగాళాఖాతంలో 2 తుపాన్ల ముప్పు..!
వాతావరణశాఖ హెచ్చరిక.. బంగాళాఖాతంలో 2 తుపాన్ల ముప్పు..!
యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త రూల్స్..
యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త రూల్స్..