బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సిద్ధార్ద్ శుక్లా కన్నుమూశాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా నిలిచిన అతడు.. గుండెపోటుతో ముంబైలో తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రిందట సిద్ధార్థ్ తన ప్రియురాలు షెహనాజ్ గిల్‌తో కలిసి బిగ్ బాస్ ఓటీటీకి గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా అతడి మరణవార్తను విని అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు సిద్ధార్థ్ శుక్లా. కాగా, చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో అటు నార్త్.. ఇటు సౌత్ ప్రేక్షకులకు కూడా సిద్ధార్థ్ శుక్లా మరింత చేరువయ్యాడు.
Big boss winner and famous TV celeb Siddharth Shukla passed away due to cardiac arrest #SiddharthShukla
— Jyotsana Patni(Paatni) (@J_Paatni) September 2, 2021
1980వ సంవత్సరం డిసెంబర్ 12న జన్మించిన సిద్ధార్థ్ శుక్లా రచనా సంసద్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ‘బాలికా వధు'(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు), ‘దిల్ సే దిల్ తక్’ వంటి డైలీ సీరియల్స్‌తో ఫేమస్ అయిన సిద్దార్థ్.. ‘జలక్ దిక్లాజా 6’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి’ ‘బిగ్ బాస్ 13’ వంటి రియాలిటీ షోలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
బిగ్ బాస్ 13 షో ద్వారానే సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ దగ్గరయ్యారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిద్దార్థ్ శుక్లా ఆకస్మిక మరణం ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తోంది. సిద్దార్థ్ ఇక లేడనే వార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, సిద్ధార్థ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు.
RIP #SiddharthShukla
A fine artist..
Great loss of such young talent.. pic.twitter.com/bc8EEbbajE— Ranveer Brar (@ranveerbrar) September 2, 2021
Shocked beyond words!! Gone toooooo soon…. Condolences to his family, loved ones. – He was loved by millions. #SiddharthShukla you will be missed – rest in peace brother. Om Shanti ?? https://t.co/gvttNVDHxh
— Riteish Deshmukh (@Riteishd) September 2, 2021
Another reminder of how fragile life is.
Heartfelt condolences to #SiddharthShukla ‘s family and friends.
Om Shanti pic.twitter.com/zTinZmyaJ5— Virender Sehwag (@virendersehwag) September 2, 2021
It’s shocking to hear about the sudden demise of #SiddharthShukla ?
My heart goes out to his family and his army of fans! Life is so unpredictable! Rest in peace.— Raashii Khanna (@RaashiiKhanna_) September 2, 2021
Shocked beyond words. RIP Siddharth and my condolences to his loved ones ?? Life is so unpredictable. Appreciate everything we have!! #SiddharthShukla
— Rahul Chahar (@rdchahar1) September 2, 2021
I’m truly sorry for Siddharth’s loved ones and fans. This is devastating. You will be missed ?
Om Shanti #SiddharthShukla— Karanvir Sharma (@karanvirsharma9) September 2, 2021
Totally Numb! This is beyond shocking! Life is so unpredictable. May his soul rest in peace?? #SiddharthShukla pic.twitter.com/OjvCBDXN94
— Sharad Kelkar (@SharadK7) September 2, 2021
Read Also: ఒక్క వికెట్ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?
హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు
డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..