Hero Balakrishna: బాలయ్య కూడా అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నాడా ? ఆ నెలలో బాక్సాఫీసుల వద్ధ రచ్చే ఇక..

|

Jan 30, 2021 | 8:28 AM

గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్‏లో సినిమా రిలీజ్ డేట్‏ల హవా కొనసాగుతుంది. యంగ్ హీరోల నుంచి అగ్రహీరోల సినిమాల వరకు దాదాపు అన్ని

Hero Balakrishna: బాలయ్య కూడా అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నాడా ? ఆ నెలలో బాక్సాఫీసుల వద్ధ రచ్చే ఇక..
Follow us on

గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్‏లో సినిమా రిలీజ్ డేట్‏ల హవా కొనసాగుతుంది. యంగ్ హీరోల నుంచి అగ్రహీరోల సినిమాల వరకు దాదాపు అన్ని మూవీల రిలీజ్ డేట్‏లను అనౌన్స్ చేశారు ఆయా చిత్ర యూనిట్ సభ్యులు. ఇక నందమూరీ బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమా నుంచి ఇంతవరకు ఎలాంటి అప్‏డేట్ లేదు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో.. అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నప్పుడు లాక్ డౌన్ ప్రభావంతో ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యి… శరవేగంగా జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం బాలయ్య, బోయపాటి సినిమా మే నెలలో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అటు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ మే నెలలో విడుదల కానుండగా.. అదే నెలలో బాలయ్య సినిమా రిలీజ్ అవుతే బాక్సాఫీసు వద్ద పోరు ఈసారి తీవ్రంగా ఉండనుంది. అంతేకాకుండా దాదాపు సంవత్సరం తర్వాత అగ్రహీరోల సినిమాలు వరుసగా విడుదలవుతుండడంతో.. ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య మే నెలలోనే రంగంలోకి దిగితే ఎవరు నెగ్గుతారనేది చూడాల్సిందే.. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో నటుడు శ్రీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో విలన్స్‏గా నటింస్తుండగా.. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ టైటిల్ ఏంటీ అనేది చిత్రయూనిట్ ప్రకటించలేదు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:

Kangana Ranaut: ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ.. అయితే ఇది బయోపిక్ కాదు.. మరేంటో తెలుసా..