AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందీ సీఖ్ రహా హూ.. ప్రభాస్

‘బాహుబలి’తో ఉత్తరాది ప్రేక్షకులకు సైతం దగ్గరైన ప్రభాస్, ప్రస్తుతం ‘సాహో’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌కు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించి డబ్బింగ్ రైట్స్ కూడా  కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాయి. ఇక ‘బాహుబలి’  హిందీ వెర్షన్‌లో ప్రభాస్‌కు ఇతరులచేత డబ్బింగ్ చెప్పించారు. అయితే ఇకపై హిందీలో డబ్బింగ్ సమస్య రాకుండా ప్రభాస్‌ సొంతంగానే డైలాగులు చెప్పాలని సిద్ధమవుతున్నారు. […]

హిందీ సీఖ్ రహా హూ.. ప్రభాస్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2019 | 11:33 AM

Share

‘బాహుబలి’తో ఉత్తరాది ప్రేక్షకులకు సైతం దగ్గరైన ప్రభాస్, ప్రస్తుతం ‘సాహో’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌కు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించి డబ్బింగ్ రైట్స్ కూడా  కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాయి. ఇక ‘బాహుబలి’  హిందీ వెర్షన్‌లో ప్రభాస్‌కు ఇతరులచేత డబ్బింగ్ చెప్పించారు.

అయితే ఇకపై హిందీలో డబ్బింగ్ సమస్య రాకుండా ప్రభాస్‌ సొంతంగానే డైలాగులు చెప్పాలని సిద్ధమవుతున్నారు. ప్రభాస్‌కు హిందీలో మంచి పట్టు ఉన్నప్పటికీ, మాట్లాడితే దక్షిణాది యాస వినిపిస్తుంది. దీంతో ఉత్తరాది యాస వచ్చేందుకు తాను ప్రత్యేకంగా హిందీ నేర్చుకుంటున్నానని, భాషలో మరింత పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నానని ప్రభాస్ వెల్లడించారు.

Follow Us