PM Modi: ప్రధాని మోడీ వికసిత్ భారత్‌లో భాగమవ్వండి.. యువతకు పిలుపునిచ్చిన పీవీ సింధు, ఆయుష్మాన్ ఖురానా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన వికసిత్ భారత్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అయుష్మాన్ ఖురానా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భాగమయ్యారు. ఈ మేరకు వికసిత్ భారత్ ఛాలెంజ్ లో పాల్గొని దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారీ స్టార్ సెలబ్రిటీలు
జాతీయ యువజనోత్సవం -2025 ను పురస్కరించుకుని ఇటీవల ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో నేషనల్ యూత్ ఫెస్టివల్ ఉంటుందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ యువతకు కూడా అవకాశమిచ్చారు. 15-29 సంవత్సరాల వయస్సు గల యువకులు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్ పేరిట నిర్వహించే ఆన్ లైన్ క్విజ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. నవంబర్ 25 నుండి డిసెంబర్ 5, 2024 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా సాగే ఈ కార్యక్రమంలో సత్తా చాటిన 3 వేల మంది యువతీ యువకులు వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో నేషనల్ యూత్ ఫెస్టివల్ లో పాల్గొనే సువర్ణావకాశాన్ని పొందుతారు. ప్రధాని మోడీతో కలిసి తమ అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ ప్రచార కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రముఖ సెలబ్రిటీలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అయుష్మాన్ ఖురానా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రధాని పిలుపునకు స్పందించారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా యువతకు పిలుపునిచ్చారు.
‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనండి. క్విజ్ ఆడి ప్రధాని మోడీని కలవండి. ఆయనతో మీ అనుభవాలను పంచుకోండి. నవంబర్ 25 నుంచి మై భారత్ పోర్ట్ లో పేర్లు నమోదు చేసుకుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి’ అని ఆయుష్మాన్ ఖురానా ట్వీట్ చేశారు.
ఇక ఇదే కార్యక్రమానికి సంబంధించి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ట్వీట్ చేసింది. ‘ ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చింది.
అయుష్మాన్ ట్వీట్..
Quiz Khelo, PM Saab se milo and share your ideas of a strong Bharat at the Viksit Bharat Young Leaders Dialogue.
Participate in the Viksit Bharat Quiz from November 25 on the My Bharat Platform and start your journey to be selected for the Viksit Bharat Dialogue… https://t.co/XPuAHYwwHo
— Ayushmann Khurrana (@ayushmannk) November 25, 2024
పీవీ సింధు ట్వీట్..
To give an effective platform to the leadership talent of the youth, in today’s episode of Mann Ki Baat, Hon’ble Prime Minister has announced National Youth Festival 2025- The Viksit Bharat Young Leaders Dialogue in Bharat Mandapam in Delhi on 11th and 12th January, 2025.
To be… pic.twitter.com/uzvSn7Zmqs
— Pvsindhu (@Pvsindhu1) November 25, 2024
వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ నేషనల్ యూత్ ఫెస్టివల్, 2025కు సంబంధించిన అన్ని వివరాలు మై భారత్ పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..