Avatar 2 Trailer: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. మోస్ట్‌ అవెటేడ్‌ అవతార్‌ – 2 ట్రైలర్‌ వచ్చేస్తోంది..

జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్‌ చిత్రం ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రద్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది...

Avatar 2 Trailer: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. మోస్ట్‌ అవెటేడ్‌ అవతార్‌ - 2 ట్రైలర్‌ వచ్చేస్తోంది..
Avatar 2 Trailer

Updated on: Oct 30, 2022 | 3:37 PM

జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్‌ చిత్రం ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రద్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రాంతాలకు అతీతమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని సీక్వెల్‌గా ‘అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

మరింత భారీ బడ్జెట్‌, హై ఎండ్‌ టెక్నాలజీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూవీ లవర్స్‌ ఈ సినిమా విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా సినిమ ట్రైలర్‌ను విడుదల చేయనుంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 2న అవతార్‌ 2 ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్‌ సైతం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగులోనూ అవతార్‌ భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశాలున్నాయన్న నమ్మకంతో పెద్ద మొత్తానికి సినిమాను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారని టాక్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ రిలీజ్‌కు రూ.120 కోట్లు వరకు రేటు పలుకుతున్నట్లు సమాచారం. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..