AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో విషాదం.. ప్రముఖ ఆర్టిస్ట్ ఆత్మహత్య

ఈ ఏడాది బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొంతమంది ప్రముఖులు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించగా

మరో విషాదం.. ప్రముఖ ఆర్టిస్ట్ ఆత్మహత్య
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 11:12 AM

Share

Ram Indranil Kamath suicide: ఈ ఏడాది బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొంతమంది ప్రముఖులు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించగా.. మరికొందరు బలవన్మరణం చేసుకొని చనిపోయారు. తాజాగా ప్రముఖ ఆర్టిస్ట్‌ రామ్ ఇంద్రనీల్‌ కామత్‌(41) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయి మాతుంగ ప్రాంతంలో తన తల్లి, సోదరితో నివసిస్తోన్న కామత్‌.. ఆగష్టు 19(బుధవారం)న బాత్‌ టబ్‌లో విగతజీవిగా కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సంఘటనా స్థలంకు చేరుకున్న వారు సూసైడ్‌ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ అందులో కామత్‌ రాసినట్లు తెలుస్తోంది.

కాగా ముంబయిలోని గ్లాస్ వర్క్ పెయింటర్స్‌లో కామత్‌కి మంచి పేరు ఉంది. దీంతో పాటు మంచి ఫొటోగ్రాఫర్‌ అయిన ఇతడికి బాలీవుడ్‌లోని పలువురితోనూ పరిచయాలు ఉన్నాయి. గత కొంత కాలంగా అతడు ఒత్తిడితో బాధపడుతుండగా.. లాక్‌డౌన్ సమయంలో మరింత మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన మరణంపై పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి ఆర్టిస్ట్‌, మంచి ఫ్రెండ్‌ని కోల్పోయానంటూ నటి సుస్మితా సేన్ పోస్ట్ చేశారు.

Read More:

కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్న ‘దేవరకొండ బ్రదర్స్‌’!

సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు

https://www.instagram.com/p/CEHIOiIhLTm/?utm_source=ig_embed

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..