మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. విషెస్ చెప్పిన పవన్
బాలీవుడ్ నటుడు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినిమా రంగంలో గొప్ప సేవలు అందించిన వారికి కేంద్రం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ ప్రముఖ బాలీవుడ్ నటుడికి ఈ అత్యుత్తమ పురస్కారం రావడం పట్ల పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు, రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినిమా రంగంలో గొప్ప సేవలు అందించిన వారికి కేంద్రం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ ప్రముఖ బాలీవుడ్ నటుడికి ఈ అత్యుత్తమ పురస్కారం రావడం పట్ల పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు.. కొందరూ సోషల్ మీడియా ద్వారా మరికొందరు ప్రకటనల ద్వారా అభినందనలు తెలియాజేస్తున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిథున్ చక్రవర్తికి అభినందనలు తెలియాజేశారు.
ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. ఆయన హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారన్నారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉందిని పేర్కొన్నారు. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయన్నారు. ‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్’ అనే పాటను ఎవరూ మరచిపోలేరని, హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ తరవాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు మిథున్ చక్రవర్తి అని కొనియాడారు. తాను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారినట్లు వివరించారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న మిథున్ చక్రవర్తి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవలే నందమూరి బాలకృష్ణ కూడా దా సాహెబ్ ఫాల్కే అవార్డు సాధించినందుకు మిథున్ చక్రవర్తికి అభినందనలు తెలిపారు. మిథున్ చక్రవర్తి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సాధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. మిథున్ చక్రవర్తి చేసిన సినిమాలు ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.