మనసుకు హత్తుకుంటోన్న ‘సోల్ ఆఫ్ మహర్షి’
సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఆడియో విడుదల అవ్వగా.. తాజాగా మరో పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ‘సోల్ ఆఫ్ మహర్షి’ పేరుతో వచ్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. విజయ్ ప్రకాశ్ ఆలపించారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అద్భుత సాహిత్యం, గాత్రానికి తోడు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం.. ఈ […]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఆడియో విడుదల అవ్వగా.. తాజాగా మరో పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ‘సోల్ ఆఫ్ మహర్షి’ పేరుతో వచ్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. విజయ్ ప్రకాశ్ ఆలపించారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అద్భుత సాహిత్యం, గాత్రానికి తోడు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం.. ఈ పాటను మనసుకు హత్తుకునేలా చేస్తోంది. మరి ఆడియో పరంగా అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ పాట సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.
కాగా మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షిపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా తన కెరీర్‌లో మిగిలిపోతుందంటూ మహేశ్ ధీమాగా ఉండటంతో.. మహర్షి ఎప్పుడెప్పుడొస్తుందా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ‘మహర్షి’ని నిర్మించారు.


