ఆంధప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి గురువారం విచారణ జరిగింది. కాగా గతంలో పిటిషనర్లకు మాత్రమే ఈ జీవో నుంచి మినహాయింపు వస్తుందని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్35 పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా టికెట్ ధరల నియంత్రణ పై జీఓ నంబర్ 35 రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ధరల నియంత్రణపై కొత్త కమిటీ ఏర్పాటు, తదితర వివరాలు తెలియజేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని ఆయన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
రాష్ట్రంలోని సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే అధికారం థియేటర్ యజమానులకు ఉంటుందని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35ను రద్దు చేసింది. ఇకతాజాగా సినిమా టికెట్ల విక్రయాల బాధ్యతను APFCకి అప్పగించింది ప్రభుత్వం. త్వరలోనే ఈ ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
Also Read:
Shocking: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం
Stock market: 15 నిమిషాల్లో వ్యవధిలో రూ.5.2లక్షల కోట్లు ఆవిరి.. ముంచేసిన మండే..