అభిమానికి దిమ్మతిరిగే సమాధానం చెప్పిన యాంకర్ సుమ.. దీంతో అతడికి ఏం చేయాలో తెలియక..
తెలుగులో ది బెస్ట యాంకర్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు సుమ కనకాల. చాలా సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నసుమ తెలుగులో గల గలా మాట్లాడుతుంది.
తెలుగులో ది బెస్ట యాంకర్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు సుమ కనకాల. చాలా సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నసుమ తెలుగులో గల గలా మాట్లాడుతుంది. వ్యక్తిగతంగా తను మళయాలి అయినా తెలుగులో ఆమెకున్న ఫాలోయింగే వేరు. అందుకే ఇప్పుడున్నయాంకర్లలలో ముందువరుసలో దూసుకెళుతుంది. తన మాటలతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. మధ్య మధ్యలో పంచెస్ వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటుంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సుమ అందులో సెలబ్రిటీలను ఇంటర్వూ చేస్తూ తన ఛానెల్‌ను ప్రమోట్ చేసుకుంటుంది. ఈ మధ్యే మంత్రి కేటీఆర్‌ను కూడా ఇంటర్వూ చేసింది. అంతేకాకుండా హీరోయిన్స్‌ను తీసుకొచ్చి తన ఛానెల్‌లో వంటల పోగ్రాం కూడా చేస్తోంది. దీంతో ఛానెల్‌కు మంచి రేటింగ్ వచ్చి సబ్ స్క్రైబర్స్ పెరుగుతున్నారు.
అయితే సుమ ఇటీవల తన అభిమానిని తమాషాగా ఆటపట్టించింది. తను చేసిన ఓ ప్రోగ్రాంకు ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం రోజూ జరుగుతుంది. అయితే అందులో ఓ అభిమాని తన చేసిన వీడియోలకు వరుసగా కామెంట్స్ పెడుతున్నా సుమ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీంతో అతడు ‘చూడండి సుమ గారూ మీరు నాకు రిప్లై ఇవ్వరు కావాలంటే రూ.1000 పందెం’ అంటూ ఓ కామెంట్ పెట్టాడు. అది చూసిన సుమ అతడికి షాకింగ్ రిప్లై ఇచ్చింది. నా అకౌంట్ నెంబర్ పంపిస్తున్నాను వేయి రూపాయలు అందులో జమ చేయండి అంటూ కామెంట్ చేసింది. దీంతో అతడు ఒక్కసారిగా నోరెళ్లబెట్టాడు.