‘ఓం జై జగదీశ్ హరే’ పాట పాడిన ప్రముఖ అమెరికన్ సింగర్.. నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే
దీపావళి సందర్భంగా ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ తన మ్యూజికల్ అభిమానులకు, ముఖ్యంగా భారతీయ హిందువులకు చిన్న కానుకను ఇచ్చారు.

American Singer Mary Millben: దీపావళి సందర్భంగా ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ తన మ్యూజికల్ అభిమానులకు, ముఖ్యంగా భారతీయ హిందువులకు చిన్న కానుకను ఇచ్చారు. హిందువులు ఆలపించే ఓం జై జగదీశ్ హరే పాటను ఆమె పాడి వీడియో రిలీజ్ చేశారు. భారతీయ సంప్రదాయాలకు అద్దం కట్టు, బొట్టు ధరించి ఆమె ఈ గీతాన్ని ఆలపించడం విశేషం. ఇక ఈ పాటను కొన్ని నెలలుగా మేరీ సాధన చేసినట్లు చెప్పారు. కాగా ఈ పాటను సెడెనాలోని ద చాపెల్ ఆఫ్ హోలీ క్రాస్ వద్ద ఆలపించడం గమనార్హం. (డ్రగ్స్ కేసు: ఆ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం)
ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె.. దీపావళి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ హిందువులు ఓం జై జగదీశ్ పాటను ఆలపిస్తూ ఉంటారు. ఈ పాట నన్ను, నా ఆత్మను ఎంతగానో కదిలించింది. భారతీయ సంప్రదాయం పట్ల నాకు మరింత మక్కువను కలిగించింది అని కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సూపర్ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుండగా.. ఈ పాట పాడేందుకు అది సరైన ప్రదేశం కాదేమో అని మరికొందరు అంటున్నారు. కాగా ఈ ఏడాది ఆగష్టు 15న మేరీ భారత జాతీయ గీతాన్ని ఆలపించి, ఇక్కడి వారి మనన్నలు పొందిన విషయం తెలిసిందే. (మన చుట్టూ ఎంత కఠినాత్ములు ఉంటారంటే: తమన్నా భావోద్వేగం)
#Diwali2020! 'Om Jai Jagdish Hare', a beautiful Hindi hymn commonly sung during #Diwali and in Indian households worldwide, is a song of worship and celebration. This hymn continues to move me, touch my spirit, and stir my passion for Indian culture."https://t.co/D5ot8xv3Yz
— Mary Millben (@MaryMillben) November 12, 2020