‘ఆడై’ ట్రైలర్ వచ్చేసింది!

హీరోయిన్ అమలాపాల్ ప్రధానపాత్రలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడై’. తెలుగులో ఈ సినిమాను ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను నిన్న విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ మూవీలో అమ‌లాపాల్ న‌ట‌న ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ […]

  • Ravi Kiran
  • Publish Date - 2:01 am, Sun, 7 July 19
'ఆడై' ట్రైలర్ వచ్చేసింది!

హీరోయిన్ అమలాపాల్ ప్రధానపాత్రలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడై’. తెలుగులో ఈ సినిమాను ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను నిన్న విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ మూవీలో అమ‌లాపాల్ న‌ట‌న ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ప్రదీప్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

తమిళంలో సెన్సార్ పూర్తి చేసుకుని ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్‌తో ప్రకంపనలు సృష్టించిన ఈ మూవీ విడుదలైన తర్వాత ఇంకెన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.