Pushpa 2: పుష్ప 2 షూటింగ్స్ ఎక్కడెక్కడ జరిగిందో తెలుసా..? ఎక్కువగా అక్కడే
పుష్ప రాజ్ కథలో తదుపరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అల్లు అర్జున్ టీమ్ కూడా ఈ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప 2 విడుదల కానుంది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం కోసం దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. పుష్ప రాజ్ కథలో తదుపరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అల్లు అర్జున్ టీమ్ కూడా ఈ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప 2 విడుదల కానుంది. అయితే పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా?
చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది
పుష్ప 2 షూటింగ్ షెడ్యూల్ 30 అక్టోబర్ 2022 న హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. సినిమా మొదటి షెడ్యూల్ ముగిసిన తరువాత, రెండవ షెడ్యూల్ జనవరి 2023 లో విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఇక్కడ పుష్ప రాజ్ తో ఒక యాక్షన్ సీక్వెన్స్ అక్కడ చిత్రీకరించారు. విశాఖపట్నం పోర్ట్‌లో 50 మంది స్టంట్‌మెన్‌లతో చిత్రీకరించిన ఈ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్ లో దుమ్మురేపుతోందని తెలుస్తోంది. ఈ సీన్లో అల్లు అర్జున్ను నేల నుంచి 100 అడుగుల ఎత్తులో తలకిందులుగా వెలదీస్తారని తెలుస్తోంది.
Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
జనవరిలో షూటింగ్ ముగిసిన రెండు నెలల తర్వాత, అంటే మార్చి 2023లో, అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా బెంగుళూరులో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. బెంగళూరులో రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 2023లో, పుష్ప 2 యొక్క జంగిల్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోతెరకెక్కించారు. ఈ షూటింగ్ కోసం ఈ ప్రాంతం చుట్టూ నివసించే చాలా మంది స్థానికులను కూడా నటింపజేశారు. ఆగస్టు 2023 తర్వాత ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే జరిగింది. అలాగే మార్చి 2024లో, ఆంధ్రప్రదేశ్‌లోని యాగంటి ఆలయంలో పుష్ప 2 యొక్క కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. పుష్ప ఫిల్మ్ ఫ్రాంచైజీ నిజమైన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్. 1990, 2000ల నాటి ఈ సినిమాలో కనిపించే జపాన్, మలేషియా సెట్స్ కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..