- Telugu News Photo Gallery Cinema photos Heroine Malavika Mohanan Trying For for action image in Film Industry, Details Here
Malavika Mohanan: యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక.!
ఇప్పటి వరకు గ్లామర్ ఇమేజ్‌తోనే కెరీర్ నెట్టుకొస్తున్న మాళవిక మోహనన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారు. కమర్షియల్ హీరోయిన్స్ క్యారెక్టర్స్‌ను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలు రెడీ అవుతున్నారు. తంగలాన్‌లో డిఫరెంట్‌గా కనిపించిన ఈ బ్యూటీ ఫ్యూచర్‌లోనే అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మాళవిక మోహనన్.. హీరోయిన్‌గా ఈ పేరు తెలిసిన వాళ్లు కొంత మందే అయినా.. గ్లామర్ క్వీన్‌గా పరిచయమున్న వాళ్ల నెంబర్ మాత్రం భారీగానే ఉంటుంది.
Updated on: Nov 27, 2024 | 12:53 PM

ఇప్పటి వరకు గ్లామర్ ఇమేజ్‌తోనే కెరీర్ నెట్టుకొస్తున్న మాళవిక మోహనన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారు.

కమర్షియల్ హీరోయిన్స్ క్యారెక్టర్స్‌ను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలు రెడీ అవుతున్నారు. తంగలాన్‌లో డిఫరెంట్‌గా కనిపించిన ఈ బ్యూటీ ఫ్యూచర్‌లోనే అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు.

మాళవిక మోహనన్.. హీరోయిన్‌గా ఈ పేరు తెలిసిన వాళ్లు కొంత మందే అయినా.. గ్లామర్ క్వీన్‌గా పరిచయమున్న వాళ్ల నెంబర్ మాత్రం భారీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటో షూట్స్‌తో హల్ చల్ చేసే ఈ బ్యూటీ..

హీరోయిన్‌గా కన్నా.. ఇన్‌స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మాళవికకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే తంగలాన్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో యాక్షన్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసిన మాళవిక, నెక్ట్స్ సినిమాల విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ మధ్య కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఈ బ్యూటీ, యాక్షన్ రోల్స్‌కు రెడీ అన్న సిగ్నల్ ఇచ్చారు.

ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాల్లో గ్లామర్ హీరోయిన్‌గానే నటిస్తున్నా.. ఇక మీదట ఓకే చేసే సినిమాలు మాత్రం డిఫరెంట్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యారు.

ప్రజెంట్ ఆన్‌లైన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న మాళవిక, సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నారు.

స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు వచ్చినా ఆ ఆఫర్స్ ఈ బ్యూటీ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. మరి కొత్తగా ట్రై చేస్తున్న యాక్షన్ ఇమేజ్ అయినా ఈ బ్యూటీకి కలిసొస్తుందేమో చూడాలి.




