AP News: ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు.. డౌట్ వచ్చి.. బ్యాగులు చెక్ చేయగా

సాధారణ తనిఖీలతో పాటు డిఆర్ఐ అధికారులు కూడా ప్రత్యేక సోదాలు ప్రారంభించారు. ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు.. వాళ్ల బ్యాగులు చెక్ చేస్తే..

AP News: ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు.. డౌట్ వచ్చి.. బ్యాగులు చెక్ చేయగా
Airport
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Nov 27, 2024 | 1:09 PM

అది విశాఖ ఎయిర్పోర్ట్.. బ్యాంకాక్ నుంచి ఫ్లైట్ ల్యాండ్ అయింది.. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు కీలక సమాచారం.. ఒక్కసారిగా అలజడి మొదలైంది.. పాసింజర్లకు తనిఖీలు చేస్తున్నారు.. సాధారణ తనిఖీలతో పాటు డిఆర్ఐ అధికారులు కూడా ప్రత్యేక సోదాలు ప్రారంభించారు. ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు.. వాళ్ల బ్యాగులు చెక్ చేస్తే.. అమ్మో.. ఆరు సరీసృపాలు. విశాఖ ఎయిర్‌పోర్టులో డిఆర్ఐ తనిఖీలు చేశారు. థాయిలాండ్ పాసింజర్స్ పై నిఘాపెట్టారు డిఆర్ఐ అధికారులు. తనిఖీలు నిర్వహిస్తే.. ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని లగేజీని చెక్ చేశారు డిఆర్ఐ అధికారులు. దీంతో వారి బ్యాగుల్లో ఆరు బ్లూ టంగ్ పనానా బల్లులను గుర్తించారు అధికారులు.

థాయిలాండ్ నుంచి స్మగ్లింగ్..

నీలిరంగు నాలుగు గల ఈ బలులను థాయిలాండ్ నుంచి తరలిస్తున్నట్టు గుర్తించారు డిఆర్ఐ అధికారులు. ఆరు బ్లూ టంగ్ పనానా బల్లుల గుర్తించి వాటిని రెస్యూ చేశారు. ఒక్కో బ్లూ టంగ్ లేజర్ 15 నుంచి 20 అంగుళాల పొడవు ఉన్నాయి. వాటిలో రెండు జాతులు మూడేసి బల్లులు ఉన్నాయి. ఆరు బలులను థాయిలాండ్ నుంచి తరలిస్తున్నా ఆస్ట్రేలియా బ్రీడ్ గా అనుమానిస్తున్నారు అధికారులు. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్ చేశారు అధికారులు. బలులను తిరిగి థాయిలాండ్ కు పంపించే ఏర్పాట్లు చేస్తుంది డి ఆర్ ఐ. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రకారం స్వదేశానికి బల్లులు పంపేందుకు సిద్ధమైంది డిఆర్ఐ.

చాక్లెట్ల మాటున బల్లుల స్మగ్లింగ్..

తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు థాయిలాండ్ నుంచి విశాఖ చేరుకున్నారు. వారి చేతిలో రెండు సూట్ కేసులు ఉన్నాయి. ఏమని ఆరాతిస్తే అందులో చాక్లెట్లు ఉన్నాయని చెప్పారు. కానీ అధికారులకు ఏదో అనుమానం. సూట్ కేసులలో అన్ని చాక్లెట్లు ఏంటి ఒకేసారి తరలిస్తున్నారు అన్నది సస్పెక్ట్ చేశారు. స్కానర్ లో పెట్టి మళ్ళీ చెక్ చేస్తే ఏదో అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆ రెండు సూట్ కేసులను ఓపెన్ చేయించారు. చాక్లెట్లు బయటపడుతున్నాయి. డబ్బాలు డబ్బాలుగా చాక్లెట్లు ఉన్నాయి. వాటి మధ్య ఓ సూట్ కేస్ లో మూడు ప్లాస్టిక్ బాక్సుల్లో చాక్లెట్లు వాటి మధ్య బల్లులు ఉన్నాయి. మరో సూట్ కేసులోనూ మరో మూడు బల్లులు గుర్తించారు. స్మగ్లర్ల ఐడియా చూసి అధికారులే అవక్కయ్యారు.

ఔషధ గుణాలుంటాయని..

నీలిరంగు నాలుక గల ఈ బల్లులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు ఉంటాయని ప్రచారం. దీంతో ఈ బల్లుల స్మగ్లింగ్ మొదలైంది. బ్లూ టంగ్ లిజార్డ్ విషపూరితమైనవి కావని చెబుతున్నప్పటికీ.. వాటి కాటు తీవ్ర నొప్పిని కలిగిస్తాయని అంటున్నారు నిపుణులు.

Lizard

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..