ఈ మూవీని కచ్చితంగా చూడండి: ‘జెర్సీ’పై అల్లు అర్జున్ ట్వీట్

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ థియేటర్లలో సందడి చేస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీపై సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. జెర్సీని చూసిన ఎన్టీఆర్.. సినిమా అద్భుతం అంటూ శుక్రవారం ట్వీట్ వేయగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘జెర్సీ నా […]

ఈ మూవీని కచ్చితంగా చూడండి: ‘జెర్సీ’పై అల్లు అర్జున్ ట్వీట్

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ థియేటర్లలో సందడి చేస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీపై సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. జెర్సీని చూసిన ఎన్టీఆర్.. సినిమా అద్భుతం అంటూ శుక్రవారం ట్వీట్ వేయగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘‘జెర్సీ నా మనసుకు హత్తుకుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశా. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. నాని నువ్వు అదరగొట్టావు. నీ సినిమాలలో బెస్ట్ మూవీ ఇది. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, అనిరుధ్ మీరు అదరగొట్టారు. కెప్టెన్ గౌతమ్ తిన్ననూరి నీకు హ్యాట్సాఫ్. మూవీ చాలా బావుంది. మూవీ లవర్స్ ఈ సినిమాను కచ్చితంగా చూడండి’’ అంటూ బన్నీ కామెంట్ పెట్టాడు. కాగా ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాసు’ చిత్రాలతో కాస్త డీలా పడ్డ నాని.. ఈ మూవీతో ఫాంలోకి రావడంతో పాటు మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu