పోనీతో బన్నీ న్యూ లుక్.. వైరల్‌గా ఫొటోలు
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ ప్రముఖులు కొత్త కొత్త లుక్‌లలో అభిమానులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌కు న్యూ లుక్ ట్రీట్‌ని ఇచ్చారు.

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ ప్రముఖులు కొత్త కొత్త లుక్‌లలో అభిమానులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌కు న్యూ లుక్ ట్రీట్‌ని ఇచ్చారు. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ వాక్‌కి వెళ్లగా.. అక్కడున్న వారు తమ కెమెరాలతో బన్నీని క్లిక్ మనిపించారు. ఈ క్రమంలో బన్నీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒత్తు జుట్టు వెనకాల చిన్న పోనీతో బన్నీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఇక ఈ ఫొటోలపై మెగా ఫ్యాన్స్.. బన్నీ లుక్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటించేందుకు సిద్దమవుతున్నారు. కరోనా పరిస్థితులు కాస్త సర్దుకున్నాక ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా.. అతడి సరసన రష్మిక నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ-సుక్కు కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కబోతున్న పుష్పపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.



