Allu Arha: పిట్ట కొంచెం కూత ఘనం.. ఐదేళ్లకే నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో అల్లు అర్హ..
Allu Arha: అల్లు అర్జున్, స్నేహాల గారాల పట్టి అర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నారి చేసే సందడికి సంబంధించిన వీడియోలు వైరల్..

Allu Arha: అల్లు అర్జున్, స్నేహాల గారాల పట్టి అర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నారి చేసే సందడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ‘శాకుంతలం’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిందీ చిన్నారి. తొలి సినిమాలోనే తన అద్భుత నటనతో ఆకట్టుకుంది అర్హ. ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్హ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత పిన్న వయసులోనే చెస్‌లో శిక్షణ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ క్రమంలోనే అత్యంత తక్కువ వయసులోనే ప్రఖ్యాత నోబుల్ అవార్డును అందుకుంది. ఓ చెస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అర్హ.. ఇతరులకు చెస్ నేర్పించడం ప్రారంభించింది. ఇలా రెండు నెల్లోనే ఏకంగా 50 మందికిపైగా చెస్‌లో ట్రైనింగ్ ఇచ్చింది. దీంతో అర్హ అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు అర్హ నైపుణ్య పరీక్షను నిర్వహించారు. ఇందులో అర్హ తన సత్తా చాటడంతో వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అవార్డును అందించారు. ఇక అర్హ చెస్ పరీక్షలో పాల్గొన్న సమయంలో తీసిన వీడియోను అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన బన్నీ అభిమానులు అర్హపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు అర్హ 5వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఇలా పుట్టిన రోజున తన పేరెంట్స్‌కు మరిచిపోలేని బహుమతి ఇచ్చింది అర్హ.
View this post on Instagram
Also Read: Viral Video: కుక్కపై కోతి స్వారీ !! చూస్తే ఫిదా అవ్వాల్సిందే !! వీడియో
ప్రపంచంలోనే ఖరీదైన చేప !! తినాలంటే అదృష్టం కావాలి మరీ !! వీడియో
ప్రపంచంలోనే ఖరీదైన చేప !! తినాలంటే అదృష్టం కావాలి మరీ !! వీడియో