CM Jagan-Tollywood: సీఎం భేటీకి ముందు చర్చనీయాంశంగా మారిన అక్కినేని నాగార్జున వ్యవహారం.. జగన్‌తో సమావేశానికి దూరం..

టాలీవుడ్‌ సమస్యలపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(Jagan) తో మరికాసేపట్లో సమావేశం కానున్నారు సినీ పెద్దలు. ఈ భేటీకోసం ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తో

CM Jagan-Tollywood: సీఎం భేటీకి ముందు చర్చనీయాంశంగా మారిన అక్కినేని నాగార్జున వ్యవహారం.. జగన్‌తో సమావేశానికి దూరం..

Edited By: Ravi Kiran

Updated on: Feb 10, 2022 | 5:13 PM

టాలీవుడ్‌ సమస్యలపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(Jagan) తో మరికాసేపట్లో సమావేశం కానున్నారు సినీ పెద్దలు. ఈ భేటీకోసం ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తో సహా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, అలీ, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, ఆర్‌ నారాయణమూర్తి తదితరులు ఇప్పటికే తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీసుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)  కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ భేటీకి హాజరుకావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం లేనందుకే నాగార్జున ఈ సమావేశానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు సీఎం భేటీకి ముందు మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. సీఎం తనకు మాత్రమే ఆహ్వానం అందించారని, తనతో పాటు ఎవరెవరు ఈ సమావేశానికి హాజరవుతున్నారో తనకు తెలియదన్న వ్యాఖ్యలు షాకింగ్‌ గా మారాయి.

కాగా అక్కినేని నాగార్జున గతంలోనే సీఎం జగన్‌ను  కలిశారు. మూడు నెలల క్రితం నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, ప్రీతం రెడ్డిని వెంటబెట్టుకుని జగన్‌తో సమావేశమయ్యారు. కాగా నేటి సమావేశానికి కూడా ఎక్కువమందికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సినీ పెద్దలు కోరారు. అయితే కొవిడ్‌ కారణంగా తక్కువ మందే రావాలని మంత్రి పేర్నినాని సూచించడంతోనే పరిమిత సంఖ్యలోనే సినీ ప్రముఖులు జగన్‌తో భేటీ కానున్నారు. అందులో భాగంగానే నాగార్జున హాజరుకావడం లేదని తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో సినిమా టికెట్ల రేట్లు,ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై చర్చించనున్నారు సినీ పెద్దలు. సినీ పరిశ్రమకు సంబంధించి 17 అంశాలను సీఎం జగన్‌ ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో పాటు యంగ్ టైగర్‌ కూడా ఈ సమావేశానికి అటెండ్‌ కావడం లేదు. నేటి సమావేశంతో టాలీవుడ్‌ సమస్యలకు ఎండ్ కార్డు కాదు శుభం కార్డు పడుతందని మెగాస్టార్‌ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Teddy Day 2022: ఈరోజు టెడ్డీ డే.. మీ భాగస్వామికి ఇచ్చే టెడ్డీ బేర్ రంగుల ప్రాముఖ్యత ఏమిటంటే..

Chennai BJP Office Attack: చెన్నై బీజేపీ కార్యాలయంపై దాడి.. పెట్రోల్ బాంబులు విసిరిన దుండగులు..

TRS on PM Modi: ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు.. రాజ్యసభ కార్యదర్శికి ఇచ్చిన టీఆర్ఎస్