Akhil Akkineni: ముంబై భామతో రొమాన్స్ చేయనున్న అక్కినేని హీరో.. సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా..
Akhil Akkineni: అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు చిత్ర బృందం
Akhil Akkineni: అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా అనంతరం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా సురేందర్‌రెడ్డి హీరోయిన్‌ను ఫైనల్ చేసేశాడని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో ఇద్దరు భారీ సక్సెస్‌కు ప్లాన్ చేశారు.
ముంబైకి చెందిన మోడల్ వైద్యా సాక్షిని అఖిల్‌కు జోడిగా కన్ఫర్మ్ చేశాడని తెలుస్తోంది. తనకు సంబంధించిన పలు యాడ్ ఫిల్మ్స్, ఇన్ స్టాగ్రామ్ పిక్చర్స్ చెక్ చేసిన సురేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఆడిషన్ కూడా తీసుకున్నారని సమాచారం. యంగ్ బ్యూటీ యాక్టింగ్ స్కిల్స్‌కు ఇంప్రెస్ అయిన ఆయన దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్. ఈ విషయాన్ని ఓ నేషనల్ చానల్ ఇంటర్వ్యూలో తెలిపిన డైరెక్టర్ సాక్షి నేచురల్ పర్‌ఫార్మర్ అని, తన క్యారెక్టర్‌కు స్పార్క్ యాడ్ చేయగలదు అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
ఈ వార్త వింటే అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే.. ఆయనతో పాటు వారిద్దరూ కూడా నటిస్తున్నారట..
Shruti Haasan: పెళ్లి చేసుకోబోతున్నారా అనే ప్రశ్నకు.. కమల్ కూతురు ఏం సమాధానం చెప్పిందో తెలుసా..