Hero Akkineni Akhil: దూసుకెళ్తున్న అఖిల్ అక్కినేని.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న యంగ్ హీరో..
లాక్డౌన్ అనంతరం సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలందరూ తెగ బిజీగా అయిపోయారు.
లాక్డౌన్ అనంతరం సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలందరూ తెగ బిజీగా అయిపోయారు. అటు అమ్ కమింగ్ యంగ్ హీరోలు సైతం వరుస సినిమాలను ఓకే చెప్పెస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ కూడా తన స్పీడ్ పెంచారు.
ప్రస్తుతం అక్కినేని అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కాబోతుంది. అటు ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. స్పై థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం అఖిల్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ ఎన్ డీకేలతో మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అటు వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా సమాచారం.
Also Read:
Ravi Teja : ఫస్ట్ టైం అందుకున్న రెమ్యునరేషన్ గురించి చెప్పిన రవితేజ.. ఎంత తీసుకున్నారంటే..