రాజమౌళి తెరకెక్కిస్తోన్న బిగ్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫ్యాష్‌బ్యాగ్ ఎపిసోడ్‌లో ఓ కీలక పాత్రలో అజయ్ కనిపించనున్నాడనని రాజమౌళి స్పష్టం చేశాడు. దీంతో ఈ మూవీలో అజయ్ ఎంతసేపు కనిపించనున్నాడని హాట్ టాపిక్‌గా మారింది. కాగా తాజా సమాచారం ప్రకారం సెకండాఫ్‌లో ఫ్యాష్‌బ్యాగ్ ఎపిసోడ్ 40నిమిషాలు ఉండనుందట. అందులో 30నిమిషాలు అజయ్ కనిపించనున్నాడని తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా.. యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ త్వరలో మొదలకానున్న తదుపరి షెడ్యూల్‌లో పాల్గొననున్నాడు. ఈ షెడ్యూల్‌ను అహ్మదాబాద్‌లో ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుండగా.. సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.