AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan-Rana Movie Update: అప్పట్లో బాబాయ్ తో ఇప్పుడు అబ్బాయ్ తో పవన్ .. హీరోయిన్స్ వీరే అంటూ టాక్

నిజానికి ఈ పాత్రలో ముందుగా హీరో గోపీచంద్ ను సంప్రదించినట్లు పుకార్లు షికారు చేశాయి. అయితే చివరికి ఆ పాత్ర రానా ముందుకు వచ్చింది. గోపాల గోపాల మూవీలో బాబాయ్‌ వెంకటేష్ తో నటించిన పవన్ తాజాగా అబ్బాయ్‌ రానాతో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బిల్లా రంగా అనే ..

Pawan Kalyan-Rana Movie Update: అప్పట్లో బాబాయ్ తో ఇప్పుడు అబ్బాయ్ తో పవన్ ..  హీరోయిన్స్  వీరే అంటూ టాక్
Surya Kala
|

Updated on: Jan 17, 2021 | 4:00 PM

Share

Pawan Kalyan-Rana Movie Update: జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే.. మరోవైపు వరస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ మరో మూవీకి రెడీ అవుతున్నాడు. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో పవన్ బిజూ మీనన్ పాత్రలో.. రానా పృథ్విరాజ్ పాత్రలో నటిస్తున్నారు. నిజానికి ఈ పాత్రలో ముందుగా హీరో గోపీచంద్ ను సంప్రదించినట్లు పుకార్లు షికారు చేశాయి. అయితే చివరికి ఆ పాత్ర రానా ముందుకు వచ్చింది. క్యారెక్టర్ బాగుంటే వెంటనే ఒకే చెప్పే ఈ భల్లాల దేవ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్‌కు ఒకే చెప్పాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోవడానికి చిత్ర బృందం అన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 20 నుంచి షూటింగ్ మొదలు పెట్టి కంటిన్యూగా 25 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో విశాలమైన లాడ్జ్ సెట్‌ను వేసారు. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్,రానా లపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రానా, పవన్ కళ్యాణ్ పై దాదాపు 70 శాతం తెరపై కలిసి కనిపించనున్నారు. గోపాల గోపాల మూవీలో బాబాయ్‌ వెంకటేష్ తో నటించిన పవన్ తాజాగా అబ్బాయ్‌ రానాతో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. చిరంజీవి, మోహన్ బాబుల అప్పట్లో బిల్లా రంగా  తో సూపర్ హిట్ అందుకున్నారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని.. కాస్టింగ్ సెలక్షన్ లో బిజీగా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారని సమాచారం. మరోవైపు పవన్ కోసం రంగంలోకి దిగిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలను అందించనున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ .. రానా సరసన సాయి పల్లవి నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే రానా సాయి పల్లవి విరాట పర్వం లో స్క్రీన్ పంచుకున్నారు. ఈ సినిమాతో రెండో సారి కలిసి నటించడం

తాజాగా సంక్రాంతి కానుకగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న మరో సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో జరుపుకోనుంది.

Also Read: మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, 9.5 కోట్లకు పైగా బాధితులు