AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aggipette Macha: అయ్యో.. ‘అగ్గిపెట్టె మచ్చ’ కు ఏమైంది? వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న కిరణ్

నిన్నటి వరకూ అందరినీ కడుపుబ్బా నవ్వించిన కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్టు తెలుస్తుంది. సోమవారం (అక్టోబర్ 05) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఇప్పుడు వెంటిలేటర్ పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అగ్గిపెట్టె మచ్చా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Aggipette Macha: అయ్యో.. 'అగ్గిపెట్టె మచ్చ' కు ఏమైంది? వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న కిరణ్
Aggipette Macha Alias Kiran
Basha Shek
|

Updated on: Oct 06, 2026 | 8:17 PM

Share

సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న వారిలో అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ ఒకరు. పచ్చి బూతులు మాట్లాడినా తనదైన శైలిలో కామెడీ చేసి అందరినీ నవ్వించే కిరణ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో అతను చేసే రీల్స్ వీడియోలకు మంచి స్పందన వస్తుంటుంది. అందుకే చాలా మంది యూట్యూబర్లు కూడా తరచూ అగ్గిపెట్టె మచ్చాను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఆ మధ్యన జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ సందడి చేశాడీ సోషల్ మీడియా సెన్సేషన్. కాగా నిన్నటి వరకూ తన సోషల్ మీడియా రీల్స్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన కిరణ్.. ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం. తీవ్ర అనారోగ్యంతో సోమవారం (అక్టోబర్ 05) తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చేరిన అతను ఇప్పుడు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కిరణ్ ఆరోగ్యం బాగా విషమించిందని అందుకే వెంటిలేటర్‌‌పై ఉంచి అత్యవసర వైద్యం చేస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారని టాక్. ఈ విషయం తెలుసుకున్న అతని అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కిరణ్‌ త్వరగా కోలుకోవాలని, తిరిగి మళ్లీ వీడియోలు చేయాలని, అందరినీ కడుపుబ్బా నవ్వించాలని కోరుకుంటున్నారు.

తిరుపతికి చెందిన కిరణ్.. ‘అగ్గిపెట్టె మచ్చ’గా సోషల్ మీడియాలో  బాగా ఫేమస్ అయ్యారు.  ఆయన చెప్పే డైలాగులు, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూసి జనాలు తెగ నవ్వుకునేవాళ్లు.  దీంతో సినిమా సెలబ్రిటీలతో సమానంగా ఆయనకు కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ వీడియోలు, మీమ్స్ లే కనిపించేవి. చివరకు యూట్యూబ్ ఛానెల్స్ సైతం ఆయన ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టేవంటే అగ్గి పెట్టె మచ్చ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏమైందో కానీ గత కొంత కాలంగా కిరణ్ కనిపించడం లేదు. వీడియోలు, రీల్స్ కూడా చేయడం లేదు. అసలు అగ్గి పెట్టె మచ్చా ఏమైపోయాడు? అని అనుకుంటోన్న సమయంలో ఇప్పుడు ఆయనకు బాగా సీరియస్ గా ఉందన్న వార్త బయటకు వచ్చింది. దీంతో ఆయన అభిమానులు బాగా కంగారు పడుతున్నారు. కిరణ్ త్వరగా కోలుకుని మాములు మనిషి కావాలని ప్రార్థిస్తున్నారు.   కాగా అగ్గి పెట్టె మచ్చ కిరణ్ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా మరింత సమాచారం రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్