AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: LGM తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించనున్న ఎంఎస్ ధోని.. ఈసారి ఏ భాషలోనంటే?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి క్రికెట్ తో పాటు సినిమాలన్నా చాలా ఇష్టం. అందుకే రిటైరైన తర్వాత 'ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్' పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఒక సినిమా కూడా వచ్చింది. అదే LGM (లెట్స్ గెట్ మ్యారీడ్). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

MS Dhoni: LGM తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించనున్న ఎంఎస్ ధోని.. ఈసారి ఏ భాషలోనంటే?
MS Dhoni
Basha Shek
|

Updated on: Apr 06, 2024 | 5:17 PM

Share

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి క్రికెట్ తో పాటు సినిమాలన్నా చాలా ఇష్టం. అందుకే రిటైరైన తర్వాత ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఒక సినిమా కూడా వచ్చింది. అదే LGM (లెట్స్ గెట్ మ్యారీడ్). గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తెలుగులోనూ నిరాశ ఎదురైంది. అయితే త్వరలో ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో మరొక సినిమా రానుంది. ఈసారి కన్నడ భాషలో ఒక సినిమాను రూపొందించేందుకు రెడీ అయ్యింది ధోని సతీమణి సాక్షి సింగ్. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుందని సమచారం. ఇది విన్న అభిమానులు థ్రిల్ అవుతున్నారు. కాగా గతంలో పోల్చుకుంటే కన్నడ సినిమాల క్రేజ్ కూడా బాగా పెరిగింది. ‘కేజీఎఫ్’, ‘కాంతారా’, ‘777 చార్లీ’, ‘కటేరా’ వంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌ లో సక్సెస్ ఫుల్ అయ్యాయి. దీంతో కన్నడలో సినిమాలు చేసేందుకు పరభాషా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ధోనీ కన్నడలో ఓ సినిమా నిర్మిస్తున్నాడనే ఆలోచన అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది.ఈ సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు నటిస్తారు? దర్శకుడెవరు తదితర క్యాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఎన్నో ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అతను ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ ధోని కి చివరి ఐపీఎల్ సీజన్ అని కూడా అంటున్నారు. ఐపీఎల్ నుంచి రిటైరయ్యాక సినిమా నిర్మాణంపై ధోని మరింత దృష్టి సారిస్తాడని ప్రచారం సాగుతోంది. దక్షిణాది భాషల్లో సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

ఎంఎస్ ధోని నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఎల్ జీ ఎమ్..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ధోని దంపతులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు