Major: విదేశాల్లో సత్తా చాటుతోన్న మేజర్.. సరికొత్త రికార్డ్ సృష్టించిన అడివి శేష్ మూవీ..

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 14 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ మూవీ ర్యాంకింగ్స్ లో టాప్ 10లో నిలిచింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు విదేశాల్లోనూ మంచి స్పందన వస్తుంది

Major: విదేశాల్లో సత్తా చాటుతోన్న మేజర్.. సరికొత్త రికార్డ్ సృష్టించిన అడివి శేష్ మూవీ..
Major
Follow us

|

Updated on: Jul 16, 2022 | 12:46 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించి మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మేజర్ (Major) సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం.. అడివి శేష్ నటనకు ప్రేక్షకులే కాదు.. సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ ఒదిగిపోయారు. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సత్తా చాటుతోంది మేజర్ మూవీ.

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 14 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ మూవీ ర్యాంకింగ్స్ లో టాప్ 10లో నిలిచింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు విదేశాల్లోనూ మంచి స్పందన వస్తుంది. తెలుగు, హిందీ, భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‏తో ఈ సినిమా అందుబాటులో ఉండగా.. బహ్రెయిన్, బంగ్లాదేశ్, కువైట్, మలేషియా, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, యూఏఈ సహా 14 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్ 10లో ఈ సినిమా నిలిచింది. ఇక ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్ 1లో ఉన్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ స్పందిస్తూ.. నాకు చాలా ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ సినిమా మాకు ఎప్పటికీ ప్రత్యేకమే అని అన్నారు. మేజర్ మూవీలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, రేవతి, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.