Varalakshmi Sarath Kumar: ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌ అని ప్రూవ్‌ చేశారు.. మీరే నా రియల్‌ హీరో: నటి వరలక్ష్మి

Sarath Kumar Birthday: సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ తన గ్లామర్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకుంటుంది. కాగా గురువారం (జులై14) వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా..

Varalakshmi Sarath Kumar: ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌ అని ప్రూవ్‌ చేశారు.. మీరే నా రియల్‌ హీరో: నటి వరలక్ష్మి
Varalakshmi Sarath Kumar

Updated on: Jul 15, 2022 | 3:10 PM

Sarath Kumar Birthday: ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌ (Varalakshmi Sarath Kumar). మొదట హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత లేడీ విలన్‌గా, ప్రాధాన్యత ఉన్న రోల్స్‌లో ఆకట్టుకుంటోంది. తెలుగులో క్రాక్‌, నాంది తదితర సినిమాల్లో వరలక్ష్మి పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ తన గ్లామర్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకుంటుంది. కాగా గురువారం (జులై14) వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. వరలక్ష్మి కూడా సోషల్‌ మీడియా ద్వారా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

మీరే మాకు ఆదర్శం..

ఇవి కూడా చదవండి

వివిధ సందర్భాల్లో తన తండ్రితో దిగిన ఫొటోలను కలిపి ఓ వీడియో రూపొందించిన ఆమె ‘మీలోని పసితనాన్ని అలాగే ఎదగనివ్వండి. వయసు అనేది ఒక నంబరు మాత్రమే అని మీరు నిరూపించారు.. మాకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీ క్రమశిక్షణ, పట్టుదల మీరు కోరుకున్న మంచి జీవితాన్ని అందిస్తాయి. లవ్‌ యూ డాడీ.. మీరే నాకు ఆదర్శం.. మీరే నా రియల్‌ హీరో.. పుట్టినరోజు శుభాకాంక్షలు డ్యాడ్‌’ అంటూ విషెస్‌ చెప్పింది వరలక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతోంది. అభిమానులు శరత్‌కుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా తమిళ సినిమాల్లో హీరోగా మెప్పించిన శరత్‌కుమార్‌ గ్యాంగ్‌లీడర్‌ వంటి సూపర్‌హిట్‌ తెలుగు సినిమాల్లోనూ వివిధ రకాల పాత్రలు పోషించాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల పక్కా కమర్షియల్‌ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో సందడి చేసింది వరలక్ష్మి. ప్రస్తుతం ఆమె తెలుగులో యశోద, హనుమాన్‌, ఎన్‌బీకే 107 సినిమాల్లో నటిస్తోంది. అదేవిధంగా పలు తమిళ సినిమాలకు కూడా సైన్‌ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..