బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫి జావేద్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఉర్ఫీ సుపరిచితమే. డిఫ్రెంట్ అవుట్ ఫిట్స్‌తో ముంబయి రోడ్లపై దర్శనమిచ్చే ఉర్ఫి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. పొట్టి పొట్టి డ్రస్‌లతో గ్లామర్ లుక్స్‌లో కనిపించే ఉర్ఫి నెగిటివ్ కామెంట్స్‌ను కూడా మూటగట్టుకున్న విషయం తెలిసిందే. మొన్నటి మొన్న బీజేపీ నాయకురాలు ఒకరు ఉర్ఫిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనకు ఇష్టమొచ్చిన దుస్తులను ధరిస్తాను అది నేరమేమి కాదని కామెంట్ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఉర్ఫి. తాజాగా ఓ రెస్టారెంట్‌కు వచ్చిన ఉర్ఫి డిఫ్రంట్ డ్రస్‌లో కనిపించి రచ్చ చేసింది. షర్ట్‌గా రూపొందించిన జీన్స్ ప్యాంట్‌ను ధరించింది. ఇంకేముంది ఉర్ఫి ధరించిన అవుట్ ఫిట్‌ను కెమెరాల్లో బంధించేశారు. దీంతో ప్రస్తుతం ప్యాంట్ షర్ట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఉర్ఫి మాట్లాడుతూ.. తన దుస్తులన్నీ మురికిగా ఉన్నాయని, తానే స్వయంగా ఈ షర్ట్‌ను తయారు చేసుకున్నానని చమత్కరించింది.
View this post on Instagram
ఇదిలా ఉంటే ఉర్ఫి జావేద్ కెరీర్ సీరియల్ ఆర్టిస్ట్‌గా మొదలు పెట్టింది. అనంతరం 2021లో ప్రసారమైన బిగ్‌బాస్ ద్వారా ఒక్కసారిగా అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉర్ఫి ఇలా రకరకాల అవుట్ ఫిట్స్‌తో దర్శనమిస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..