AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌లో ఆ స్వేచ్ఛ ఉంటుంది.. సౌత్ సినిమాల్లో అలా ఉండదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ

తమన్నా ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకుంది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది .

బాలీవుడ్‌లో ఆ స్వేచ్ఛ ఉంటుంది.. సౌత్ సినిమాల్లో అలా ఉండదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ
Tamannaah
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2026 | 10:34 AM

Share

మిల్కీ బ్యూటీ తమన్నా  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అందాల తార. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది మిల్కీ బ్యూటీ. తెలుగులో వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. మనదగ్గర దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించింది. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. ఈ చిన్నది ఎక్కువుగా హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలాగే ఓదెల 2 సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా సౌత్ ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. బాలీవుడ్ లో ఏదికావాలో అది ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని.. కానీ సౌత్ లో అలా ఉండదని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో మాత్రం నటన లేదా గ్లామర్ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సౌత్‌లో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందని తమన్నా చెప్పుకొచ్చింది.ఇప్పుడు ఈ కామెంట్స్ తగ వైరల్ అవుతున్నాయి. మిల్కీ బ్యూటీ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజానికి తమన్నాకు క్రేజ్ అలాగే గుర్తింపు వచ్చింది సౌత్ ఇండస్ట్రీలోనే ముఖ్యంగా తెలుగు సినిమాల్లో.. అలాగే తమిళ్ లోనూ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది. సౌత్ సినిమాలతోనే క్రేజ్, ఫ్యాన్ బేస్, స్టార్ డమ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లి సౌత్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us