Sobhita Dhulipala: ఆ ఉద్దేశంతోనే నటించను.. శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

ఎప్పుడూ సినిమాల్లో కనిపించాలనో, నేతి నిండి పని ఉండాలనే ఉద్దేశంతో తాను సినిమాల్లో నటించనని చెప్పుకొచ్చిందీ చిన్నది. కేవలం సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ఏ పాత్ర పడితే అది చేయనని తెలిపింది. తనకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉన్నాయని వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తూ పోతానని తెలిపింది. అలాగే హీరోయిన్‌ అన్న మాత్రన కొన్ని పాత్రలే చేస్తానంటే కుదరదని చెప్పుకొచ్చిన శోభిత..

Sobhita Dhulipala: ఆ ఉద్దేశంతోనే నటించను.. శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
Sobhita Dhulipala

Updated on: Sep 11, 2023 | 2:39 PM

2016లో బాలీవుడ్ చిత్రంతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార శోభిత ధూళిపాళ. తనదైన అందం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. అనతి కాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఇక 2018లో గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మేజర్ చిత్రంతో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిన్నది తాజాగా ‘మేడ్‌ ఇన్‌ హెవెన్ 2’తో మెస్మరైజ్‌ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభిత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ సినిమాల్లో కనిపించాలనో, నేతి నిండి పని ఉండాలనే ఉద్దేశంతో తాను సినిమాల్లో నటించనని చెప్పుకొచ్చిందీ చిన్నది. కేవలం సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ఏ పాత్ర పడితే అది చేయనని తెలిపింది. తనకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉన్నాయని వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తూ పోతానని తెలిపింది. అలాగే హీరోయిన్‌ అన్న మాత్రన కొన్ని పాత్రలే చేస్తానంటే కుదరదని చెప్పుకొచ్చిన శోభిత.. తనకు వచ్చిన అవకాశాల్లోనే మంచి పాత్రల్ని ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది. తాను చేసిన పాత్రకు వందశాతం మనసు పెట్టి పని చేసుకుంటూ పోతున్నానని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

అవకాశాలు ఎప్పుడూ మన చేతులో ఉండవన్న శోభిత.. పాత్రల ఎంపిక మాత్రమే మన చేతుల్లో ఉంటాయని చెప్పుకొచ్చింది. అలా అయితే కేవలం కొందరు గొప్ప దర్శకులతోనే పనిచేస్తానని, అలాంటి అవకాశం ఉండదు కాబట్టే ఒప్పుకున్న సినిమాలను వంద శాతం మనసు పెట్టి చేస్తానని తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇక మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2లో నటించడంపై స్పందించిన శోభిత.. ఆ పాత్ర తనకివ్వడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2’ లోని తన క్యారెక్టర్‌ నిజ జీవితంలో తన పాత్రకు దగ్గరగా ఉంటుందని చెప్పుకొచ్చిందీ చిన్నది. ఇక డాన్‌ 3 చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్న వార్తలపై కూడా శోభిత క్లారిటీ ఇచ్చింది.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘డాన్‌ అనేది ఒక క్లాసిక్‌ చిత్రం. ఆ చిత్రానికి సీక్వెల్‌ చిత్రంలో నటించాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు. ఆ ఉహే చాలా ఉద్వేగంగా ఉంది. డాన్‌2లో ప్రియాంకా నటన అద్భుతంగా ఉంటుంది. డాన్‌3లో ఆడిషన్‌ ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇలాంటి చిత్రాల్లో నటించాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది’ అని చెప్పుకొచ్చిందీ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..