AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

ఫోన్‌ను అతిగా వాడటం వల్ల ఓ అందాల నటి మెడకు శస్త్రచికిత్స చేయించుకున్నారు . ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆ నటి ఎవరో తెలుసా .?

అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 12, 2026 | 8:52 PM

Share

ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఊపేసిన అందాల తార ఆమె.. స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ క్రేజీ నటి.. బీ గ్రేడ్ సినిమాలో నటించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆమె.. శృంగార తారగా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.  తెలుగుతో పాటు తమిళ్ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆ అందాల తార ఆసుపత్రిపాలు అయ్యింది. స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ఆమె హాస్పటల్ బెడ్ ఎక్కాల్సి వచ్చింది. ఇంతకూ ఆమె ఎవరు.? ఎందుకు ఆసుపత్రిలో చేరిందో చూద్దాం.!

ఇది కూడా చదవండి : అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..! ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కించిన ముద్దుగుమ్మ షకీలా. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు షకీల. తాజాగా ఆమె హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. గంటల తరబడి ఫోన్ వాడటం వల్ల మెడకు గాయమైన నటి షకీలా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న ఫోటోలను, వీడియోలను చూపిస్తూ షాకిల సన్నిహితురాలు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున

మెడకు గాయం కావడంతో షకీలా మెడపట్టీ ధరించి వీడియోలో కనిపిస్తుంది. మంచం దిగి తినడానికి సహాయం చేయమని ఆమె తన హెల్పర్ ను అడగడటం ఈ వీడియోలో చూడొచ్చు. తనకు ఈ పరిస్థితి రావడానికి కారణం నిరంతరం ఫోన్ వాడటమేనని షకీలా తెలిపారు. “నాకు ఇటీవల ఆపరేషన్ జరిగింది. నేను ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా చెబుతున్నాను. ఫోన్ మనకు చాలా ఉపయోగకరమైన వస్తువు. కానీ దాన్ని మరీ ఎక్కువగా వాడకండి.” నేను మంచం మీద పడుకుని వరుసగా నాలుగు గంటల వరకు నా ఫోన్‌లో గేమ్స్ ఆడేదాన్ని. మధ్యలో టీ లేదా కాఫీ తాగడానికి మాత్రమే లేచేదాన్ని.. టీ తాగిన తర్వాత, మళ్ళీ అదే గేమ్ ఆడేదాన్ని.. ఆ తర్వాత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆ రీల్‌ను చూసేదాన్ని.. దీనివల్ల నా మెడ నరాలు ప్రభావితమై, చివరికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది అని తెలిపింది షకీలా. “పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం పూర్తిగా మానుకోండి. మీరు కూడా వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. నా వీడియోలను చూడకండి, మనకు ఉపయోగపడే వీడియోలను మాత్రమే చూడండి. లేకపోతే, 3 లక్షల రూపాయలు పోతాయి, చాలా బాధ ఉంటుంది,” అని షకీలా ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అయ్యో పాపం.. కళ్ళు చిదంబరం కళ్ళ వెనక ఇంతా కథ ఉందా.! తెలిస్తే షాక్ అవుతారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us