పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawann Kalyan) , రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తోన్న చిత్రం ‘భీమ్లానాయక్(Bheemla Nayak) ‘. నిత్యామేనన్ పవర్ స్టార్ తో జోడీ కట్టనుండగా, సంయుక్తా మేనన్ రానా (Rana Daggubati) సరసన నటిస్తోంది. ‘అప్పట్లో ఒకడుండే వాడు’ లాంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన సాగర్. కె. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. అన్నీ కుదిరితే ఈనెల25న భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలను హైప్ చేశాయి.
కాగా ‘భీమ్లా నాయక్’ సినిమాలోని టైటిల్ సాంగ్ ‘లాలా భీమ్లా’ సంగీతాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందుకే చిత్రబృందం ప్రత్యేకంగా ఈ పాటకు డీజే వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ పాటకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహిత్యం అందించగా యంగ్ సింగర్ అరుణ్ కౌండిన్య అద్భుతంగా ఆలపించాడు. తాజాగా ఈ పాటను కారు డ్రైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేసింది హీరోయిన్ సంయుక్తా మేనన్ (Samyuktha Menon). అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై స్పందించిన నెటిజన్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, టేక్ కేర్ అంటూ ఆమెకు సూచించారు. కాగా కొన్ని రోజుల క్రితం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఈ పాటపై మనసు పారేసుకుంది. మీకు ఇష్టమైన పాట ఏది అని ఓ నెటిజన్ అడగ్గా ‘ ‘భీమ్లా నాయక్’ సినిమాలోని ‘లా లా భీమ్లా’ సాంగ్ అని చెప్పింది. ఈ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నానంటూ చెప్పుకొచ్చింది.
Play #lalabheemla , Drive ❤️❤️❤️ pic.twitter.com/l4HpOXDy5j
— Samyuktha (@iamsamyuktha_) February 9, 2022
Also Read:Lata Mangeshkar: లతాజీ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. గాన కోకిలకు నివాళి అర్పించిన ఐరాస..
Andhra Pradesh: జంబో అరటి గెల.. అందరూ షాక్.. 37 హస్తాలు, సుమారు 600 కాయలు