AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతను బాధించిన ఆ ప్రకటన.. ఇన్‌స్టాలో గోడు వెల్లబోసుకున్న సామ్‌.. ఇంతకీ విషయమేంటంటే..?

Samantha: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో సమంత ముందు వరుసులో ఉంటారు. నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటుందీ బ్యూటీ...

Samantha: సమంతను బాధించిన ఆ ప్రకటన.. ఇన్‌స్టాలో గోడు వెల్లబోసుకున్న సామ్‌.. ఇంతకీ విషయమేంటంటే..?
Narender Vaitla
|

Updated on: Jan 08, 2022 | 2:36 PM

Share

Samantha: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో సమంత ముందు వరుసులో ఉంటారు. నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటుందీ బ్యూటీ. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో వివాహ బంధం నుంచి తప్పుకున్న తర్వాత సమంత చేస్తున్న పోస్టులు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఓ ప్రకటన తనను తీవ్రంగా బాధకు గురి చేసిందని రాసుకొచ్చింది సామ్‌.

ఇంతకీ సమంతను అంతలా బాధించిన ఆ విషయమం ఏంటనేగా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు ఇకపై కనుమరుగకానున్నట్లు ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల పాటు మొబైల్‌ ఫోన్‌ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసుకున్న బ్లాక్ బెర్రీ జనవరి 4 నుంచి తన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ బ్లాక్‌ బెర్రీ ఓఎస్, బ్లాక్‌ బెర్రీ ప్లే బుక్‌ ఓఎస్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో బ్లాక్‌ బెర్రీ యూజర్లు వారిఫోన్‌లలో ఓఎస్‌ 7.1, బీబీ 10లలో ఫోన్‌కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఎమెర్జెన్సీ నెంబర్‌లు పనిచేయవు.

దీంతో బ్లాక్‌ బెర్రీ బ్రాండ్‌ను ఇష్టపడే నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే సమంత కూడా బ్లాక్‌బెర్రీ ప్రకటనకు సంబంధించిన స్క్రీన్‌ షార్ట్‌ను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇది ఇంతలా ఎందుకు బాధిస్తుందో నాకు అర్థం కావడం లేదు’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

Sam

ఇదిలా ఉంటే పుష్ప చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో మరోసారి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. ఓ వైపు తెలుగులో ఇప్పటికే శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసిన సామ్‌.. యశోద సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టింది. ఇలా తెలుగులో బిజీగా ఉంటూనే బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీటౌన్‌ ఎంట్రీ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సమంత హాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఖరారైన విషయం తెలిసిందే.

Also Read: PM Security Breach: ఆ అద్భుత అవకాశాన్ని మోడీ కోల్పోయారు.. ప్రధాని పంజాబ్‌ పర్యటనపై అఖిలేష్ సెటైర్లు..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

China New Record: చైనా సరికొత్త రికార్డు.. ఏకంగా సూర్యడిని మించి శక్తిని ఉత్పత్తి చేసింది.. షాకింగ్ వివరాలివే..