
అందం, అభినయం కలగలిపిన అతి కొద్ది మంటి నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. తెలుగులో దాదాపు అందరు టాప్ యంగ్ హీరోల సరసన ఆడిపాడింది. పూజా హెగ్డే కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ‘అల వైకుంఠపురంలో’ ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పూజాకు కూడా నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌కు పూజాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
బుట్ట బొమ్మ సాంగ్‌లో సిగ్నేచర్ స్టెప్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అప్పటి నుంచి పూజాను బుట్ట బొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. అమూల్య పాత్రలో నటించి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమా తాలుకు జ్ఞాపకాలను తాజాగా పంచుకుందీ బ్యూటీ. అల వైకుంఠపురములో చిత్రం విడుదలైన మూడేళ్లు గడుస్తోన్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. బుట్టబొమ్మ వీడియో సాంగ్‌ను పోస్ట్ చేసిన ఈ బ్యూటీ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.
Three years ago today was born a character named ‘Amulya’ and this movie does hold a special place in my heart. Here’s to celebrating #3YearsOfAlaVaikunthapurramuloo ?@alluarjun @MusicThaman @NavinNooli @GeethaArts @adityamusic @Nivetha_Tweets @pnavdeep26 @iamSushanthA pic.twitter.com/2qQqdYn40t
— Pooja Hegde (@hegdepooja) January 12, 2023
‘అమూల్య క్యారెక్టర్ మూడేళ్ల క్రితం పుట్టింది. ఈ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమే. మూడేళ్ల వేడుకలు జరుపుకోవడానికి అల వైకుంఠపురములో సిద్దంగా ఉంది.’ అంటూ బుట్టబొమ్మ పాటను పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో మూవీ 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుందో.. ఈ సినిమాలోనే పాటలు కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..